‘ఖుషీ’ రోజులు గుర్తుకొచ్చేలా లుక్‌

Pawan Kalyan
pawan, keerti suresh

‘ఖుషీ’ రోజులు గుర్తుకొచ్చేలా లుక్‌

పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు హంగామా అయ్యింది.. సెప్టెంబర్‌ 2 వపన్‌ పుట్టినరోజున పవన్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కలయికలో వస్తున్న చిత్రం కాన్సెప్ట్‌ పోస్టర్‌, మ్యూజికల్‌ సర్ప్తెజ్‌ అంటూ హడావుడి చేసి అభిమానుల్లో జోష్‌ నింపారు.. వాటితోనే సరిపెట్టుకోకుండా పవన్‌ కల్యాణ్‌,తోపాటే హీరోయిన్‌ కీర్తి సురేష్‌ కలిసున్న లుక్‌ని కూడ వదిలి అభిమానులను పిచ్చ ఆనందానికి గురిచేశారు.. మరి ఈచిత్రంలో పవన్‌ కల్యాణ్‌ ఇద్దరు హీరోయిన్స్‌తో రొమాన్స్‌ చేయనున్నారు.. ఒకరు కీర్తి సురేష్‌ కాగా మరొకరు అను ఇమ్మాన్యుయేల్‌ .అలాగే ఖుష్భూ, ఇంద్రజలు కూడ ఈచిత్రంలో ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు ఈ లుక్‌ని నటి కీర్తి సురేష్‌ విడుదల చేశారు.. అయితే ఇలాంటి సీన్‌ ఎక్కడో చూసినట్టు ఫీలింగ్‌ వచ్చేస్తుంది. అదే పవన్‌ ‘ఖుషి సినిమాలో భూమిక పుస్తకం చదువుతుండగా పవన్‌ భూమికను చూస్తున్నట్టుగా ఉందని అంటున్నారు.