ఖాతాదారులకు పిఎన్‌బి గుడ్‌న్యూస్‌

punjab national bank
punjab national bank

న్యూఢిల్లీ: నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఖాతాదారులకు తీపికబురు అందించింది. 10కోట్ల రూపాయల వరకూ డిపా జిట్లపై వడ్డీరేట్లను 1.25శాతం మేర పెంచింది. పెరిగిన వడ్డీరేట్లు 2018, జనవరి 1నుంచి అమ ల్లోకి రానున్నాయి. రూ.కోటి వరకూ స్వల్పకాలిక డిపాజిట్లపై ప్రస్తుతం నాలుగు శాతంగా ఉన్న వడ్డీరేటును 5.25శాతానికి పెంచింది. 91నుంచి 179 రోజుల మెచ్యూరిటీ గల డిపాజిట్లపై వడ్డీ రేటును ప్రస్తుత 6శాతం నుంచి 6.25శాతానికి పెంచింది. ఏడాది వ్యవధి కలిగిన బల్క్‌ టర్మ్‌ డిపా జిట్లపై 5శాతంగా ఉన్నవడ్డీని 5.7శాతానికి పెంచిం ది. మూడు నుంచి పదేళ్ల వ్యవధి గల డిపాజిట్లపై వడ్డీరేటును 5నుంచి 5.25శాతానికి పెంచింది.