ఖర్చులపై చర్చలు తప్పనిసరి

HOUSE
HOUSE

ఖర్చులపై చర్చలు తప్పనిసరి

కొత్త దంపతులు డబ్బు గురించి మాట్లాడుకోవడం తప్పేం కాదు. ఆస్తులూ, అప్పులూ, చేతిలోని డబ్బు. బ్యాంకులోని నిలువలు, ఇలా సమస్తం చర్చించుకోవాలి. తక్షణం వదిలించుకోవాల్సిన రుణాలు, వ్యక్తిగత రుణాలు వగైరాల విషయంలో సమష్టిగా ఒక నిర్ణయానికి రావాలి. ప్రతి మనిషికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉంటాయి. వాటిని భాగస్వామి సమక్షంలో బయటకు తీయాలి. ఆ వివరాలను తనకూ చెప్పాలి. జీవితభాగస్వామి ఆర్థిక స్వభావమేమిటో అర్ధమైపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. తన ఆర్థిక పరిజ్ఞానం ఎంత అన్నది కూడా తెలుస్తుంది. నొప్పించక, తానొవ్వక లోపాలుంటే సరిచేసుకోవడం ఇద్దరికీ సంబంధించిన బాధ్యత. కొత్త కుటుంబం కొత్త ఆర్ధిక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఇల్లు ఎప్పుడు ఎక్కడ కొనాలి వంటి విషయాలను నిర్దారించుకోవాలి. చదువులు, పెద్ద వస్తువులు కొనడం వంటి లక్ష్యాల్ని ప్రధాన్యాల వారిగీగా విభజించుకోవాలి. ఇన్ని విషయాల్ని చర్చించుకున్నాక రూపాయి రాకపోకల మీద స్పష్టత వస్తుంది. నెలవారి బడ్జెట్‌ మనసులోనే తయారవుతుంది. మిగులు డబ్బు, మదుపు ఎలా చేయాలన్నది నిర్ణయించుకోవాలి. ఇద్దరూ లేక ఇద్దరిలో ఒకరు గొప్ప సంపాదన పరులు కావచ్చు, కాకపోవచ్చు అంతమాత్రాన ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని, అభిమానాన్ని, ప్రేమను పెంచుకోవాలే తప్ప తగ్గించుకోవద్దు. అలా అయితే కుటుంబంలో ఎవరూ తక్కువా, ఎక్కువగా కాకుండా సమానంగా ఉండగలుగుతారు.