కార్పొరేషన్‌ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోంది: తుమ్మల

tummala-nageswara-rao
tummala-nageswara-rao

ఖమ్మం: రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు
శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం కార్పొరేషన్‌ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని, ఇప్పటికే
రూ.500 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. ఖమ్మం కార్పొరేషన్‌ ప్రజలకు సకల సౌకర్యాలు కల్పించడం కోసం ప్రభుత్వ నిధులే కాకుండా సొంత నిధులు
కూడా సమకూర్చుకునే స్థాయికి వచ్చిందని అన్నారు.