క‌స్ట‌డీలో ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాది

Arrested
Terrorist Arrested

దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం వద్ద లష్కరే తోయిబా ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో ఇప్పటికే ఉగ్రవాదుల కదలికలపై ఢిల్లీ పోలీసులు నిఘా వేశారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించి వాంటెండ్ ఉగ్రవాది ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ ఏటీఎస్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ లో ఉగ్రవాదిని అరెస్టు చేశాయి.