క‌ర‌స్పాండెన్స్‌లో ఉర్దూ

J M I U
J M I U

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) యూనివర్సిటీ సంవత్సర కాలవ్యవధి గల ఉర్దూ కరస్పాండెన్స్ కోర్సుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. యూనివర్సిటీలోని అర్జున్ సింగ్ సెంటర్ ఫర్ డిస్టాన్స్ అండ్ ఓపెన్ లెర్నింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ కోర్సును అందిస్తున్నారు. ఇంగ్లిష్, హిందీ మీడియంలలో పాఠ్యాంశాల బోధన ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎవరైనా రూ.100 నామమాత్రపు ఫీజు చెల్లించి ఉర్దూ భాషను నేర్చుకోచ్చు. సార్క్ దేశాల అభ్యర్థులకు ఈ ఫీజును 20 డాలర్లుగా నిర్ణయించగా, ఇతర దేశాల వారు 50 డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కోర్సుకు దరఖాస్తుకు చేసుకునేందుకు ఎలాంటి గడువు తేదీ లేదని యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఏడాదిలో ఎప్పుడైనా ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ డిస్టాన్స్ అండ్ ఓపెన్ లెర్నింగ్ విభాగం ద్వారా కోర్సుకు సంబంధించిన అప్లికేషన్ ఫాం, ప్రాస్పెక్టస్‌ను పొందవచ్చు. ఇందుకు గాను ఆసక్తి ఉన్న అభ్యర్థులు రూ.10 పోస్టేజ్‌తో కూడిన ఎన్వలప్‌ను పంపించాల్సి ఉంటుంది. ఈ కోర్సుకు ఎలాంటి ట్యూషన్ ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. jmi.ac.in/upload/centres/cdol/uccform.pdf వెబ్‌సైట్‌ను సందర్శించి కూడా అప్లికేషన్ ఫాంను పొందవచ్చు. ఇందుకు గాను అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.