క‌ర్వాచౌత్‌ను ఘ‌నంగా జ‌రుపుకున్న బాలీవుడ్ భామ‌లు

karva chouth fest in anil's house
karva chouth fest in anil’s house

ముంబ‌యిః తమ సౌభాగ్యం బాగుండాలని కోరుతూ బాలీవుడ్ భామలంతా ఒక చోట చేరి ఘనంగా పూజలు నిర్వహించారు. తమ పసుపుకుంకుమలు కలకాలం నిలవాలని భగవంతుడిని ప్రార్థించారు. ఉత్తరాదిన నిర్వహించే కర్వా చౌత్‌ వ్రత వేడుకల్లో ప్ర‌ముఖ న‌టీమ‌ణులు పాల్గొన్నారు. బాలీవుడ్ అగ్రహీరో అనిల్ కపూర్ ఇంట్లో… ఆయన భార్య సునీతా కపూర్ ఆధ్వర్యంలో వ్రతం కొనసాగింది. ఈ వ్రతానికి శ్రీదేవి, రవీనా టాండన్, శిల్పాశెట్టి, నీలమ్ కొఠారీ, చంకీపాండే భార్య భావనా పాండే, సంజయ్ కపూర్ భార్య సంఘా, హీరో వరుణ్ ధావన్ తల్లి కరుణా ధావన్, వదిన జాహ్నవీ ధావన్ లు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను శ్రీదేవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.