క‌ర్ణాట‌క వైఖ‌రి స‌రిగా లేదుః సీఎం చంద్ర‌బాబు

AP CM Chandrababu Naidu
AP CM Chandrababu Naidu

అమ‌రావ‌తిః నీటి విడుదల విషయంలో కర్ణాటక వైఖరి సరిగా లేదని, కర్ణాటకపై న్యాయపోరాటం చేస్తామని సీఎం
చంద్రబాబునాయుడు అన్నారు. మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ… ప్రత్యేక హోదా కోసం
ఎంపీలతో జగన్‌ రాజీనామా చేయిస్తానన్నారు, ఎంపీలతో ఇంకా ఎందుకు రాజీనామా చేయించలేదో చెప్పాలన్నారు.
నంద్యాలపై ట్విట్టర్‌ ద్వారా అభినందించిన మోడీకి ధన్యవాదాలు తెలిపామన్నారు. సిట్టింగ్‌ నేత చనిపోతే ఏకగ్రీవం
చేయాలనే సంప్రదాయానికి నేనే శ్రీకారం చుట్టానన్నారు. వైఎస్సార్‌, శోభానాగిరెడ్డి చనిపోతే పోటీ పెట్టలేదన్నారు.