క‌ర్ణాట‌క‌లో రూ.152కోట్ల నగదు, సామగ్రి స్వాధీనం

Money, Cash
Money, Cash

న్యూఢిల్లీ: ఎన్నికలు జరుగనున్న కర్నాటక రాష్ట్రంలో ఇప్పటివరకూ అధికారులురూ.152 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు వివిధ సామగ్రిని స్వాధీనంచేసుకున్నారు. ఈమొత్తంలో ఆదాయపుపన్నుశాఖ రూ.20.43 కోట్ల నగదును స్వాధీనంచేసుకుంది. ఎన్నికల సంఘం శనివారం ఈ వివరాలిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలుసైతం ఇప్పటివరకూ నగదు, సంబంధిత సామగ్రిని సుమారు 152కోట్ల విలువైన వాటిని కర్నాటకలో వివిధ ప్రాంతాల్లో స్వాధీనంచేసుకున్నట్లు వెల్లడించింది.రూ.67.27 కోట్ల నగదును స్వాధీనంచేసుకోగా మొత్తం బంగారం ఆభరణాలు వంటివి రూ.43 కోట్లకు మించి ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి మద్యం కన్‌సైన్‌మెంట్లనుసైతం స్వాధీనంచేసుకుంది. రూ.23.36 కోట్లుగా ఉంది. మొత్తం సొమ్ములో ఆదాయపు పన్నుశాఖ భారీమొత్తం స్వాధీనంచేసుకుంది. అక అభ్యర్ధి దాఖలుచేసిన అఫిడవిట్‌ ఆధారంగా ఆదాయపు పన్నుశాఖ అధికారులు చేసిన పరిశీలనల్లో అవకతవకలున్నాయని తెలింది.తదనంతరం ఆయన అభ్యర్ధిత్వాన్ని బ్లాక్‌చేసింది. స్వీయ అసెస్‌మెంట్లద్వారా పన్నుల్లో అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. ఆయన సతీమణి తరపున భారీ అవకతవకలుజరిగాయనిసైతం వెల్లడించింది. గత నెలలోని చివరివారంలో ఆదాయపు పన్నుశాఖ అనేకప్రభుత్వ కాంట్రాక్టర్ల ఇళ్లు,నివాసాలపై దాడులునిర్వహించి లెక్కలుతేలని భారీ నగదును స్వాధీనంచేసుకుంది. ఐదులక్షల లీటర్ల మద్యం స్వాధీనంచేసుకునట్లు తేలింది. వీటితోపాటే ప్రెషర్‌ కుక్కర్లు, చీరెలు, కుట్టుమిషన్లు, గుట్కా, లాప్‌టాప్‌లు, వాహనాలు, ఇతరత్రా సామగ్రిని మొత్తం స్వాధీనంచేసుకుంది. వీటి విలువ రూ.18.57 కోట్లుగా ఉంది. వీటితపాటు రూ.32.54 కోట్లనగదుతో మొత్తం 152.78 కోట్ల విలువైన నగదు, వివిధ సామగ్రిని స్వాధీనంచేసుకున్నట్లు తేలింది. ఇక మాదకద్రవ్యాలుసైతం రూ.39.80 కోట్ల విలువైన వాటిని స్వాధీనంచేసుకున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. వివిధ నిఘా పోలీస్‌, ఆదాయపు పన్నుశాఖ అధికారులతో కూడిన బృందాలు రాస్ట్రంలోఎన్నికల నిమిత్తం అవకతవకలు వెలికితీసేందుకు ఎన్నికల సంఘం నియమించింది. నల్లధనం, అక్రమ లబ్దిచేకూర్చే కుట్రలు అరికట్టేందుకు ఓటర్లు స్వేఛ్చగా ఓటుహక్కు వినియోగించుకునే వాతావరణం కల్పిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈనెల 12వ తేదీ కర్నాటకలో ఒకేరోజుతో మొత్తం అన్ని నియోజకవర్గాల్లోను పోలింగ్‌ముగిస్తోంది. 15వ తేదీ ఓట్ల లెక్కింపుజరుగుతుంది.