క‌రీంన‌గ‌ర్ చేరుకున్న సీఎం కెసిఆర్‌

KCR
KCR

హైదరాబాద్: క‌రీంన‌గ‌ర్ పర్య‌ట‌న‌కు వెళ్లిన సీఎం కేసీఆర్ కొద్దిసేప‌టి క్రిత‌మే కరీంనగర్ జిల్లా తీగలగుట్టలోని తన నివాసానికి చేరుకున్నారు. దీన్నే ఉత్తర తెలంగాణ భవన్ అని అంటారు. ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో కరీంనగర్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో తీగలగుట్టకు వెళ్లారు. రాత్రి అక్కడే బస చేస్తారు. గురువారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతంలో కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే చేస్తారు. పనుల పురోగతిపై ప్రాజెక్టు దగ్గరే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.