క‌బ‌డ్డీలో ఛాంపియ‌న్‌లుగా చిత్తూరు, విశాఖ‌

Kabaddi
Kabaddi

మూడు రోజుల పాటు ప్రకాశం జిల్లా కందుకూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణంలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు శనివారం ముగిసాయి. పురుషుల విభాగంలో మొదటి బహుమతి చిత్తూరు జిల్లా జట్టు కైవశం చేసుకుంది. రెండవ బహుమతిని అనంతపురం జిల్లా జట్టు 7 పాయింట్ల ఆధిక్యతతో గెలుచుకుంది. మహిళా విభాగంలో విశాఖపట్నం జిల్లా జట్టు 10 పాయింట్ల మొదటిస్థానంలో నిలిచింది. 8 పాయింట్లతో కృష్ణజిల్లా జట్టు 2వ స్థానంలో సాధించింది.