క‌న్న‌డనాట‌ ఓట్ల‌ లెక్కింపుకు సిద్ధం

Votes Counting
Votes Counting

దేశ ప్రజల దృష్టంతా తన వైపునకు తిప్పుకున్న కర్ణాటక ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్‌ల భవితవ్యం ఈవీఎంలలో ఓట్ల రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌, సర్వేలు కూడా కర్ణాటకలో ఏ పార్టీకి అధిక సీట్లు వస్తాయో స్పష్టంగా చెప్పలేకపోయాయి. ఈ నెల 12న మొత్తం 222 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల కౌంటింగ్‌ కోసం సంబంధిత అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు ఉదయం మొత్తం 40 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల కౌంటింగ్‌లో 11 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు. రేపు సాయంత్రంలోగా అన్ని నియోజక వర్గాల ఓట్ల ఫలితాలు వెల్లడవుతాయి. ఈ ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓటర్లు ఏ పార్టీకి జై కొట్టారో తెలుసుకోవాలంటే రేపు సాయంత్రం వరకు ఆగాల్సిందే.