క్షీణించిన మహీంద్ర నికరలాభం

mahindra

క్షీణించిన మహీంద్ర నికరలాభం

ముంబయి, ఆగస్టు 5: దేశీయంగా వృద్ధిచెందుతున్న ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్ర అండ్‌ మహీంద్ర తన నికరలాభాల్లో 19.79శాతం క్షీణతను ప్రకటించింది. తొలిత్రైమాసికంలో 765.96 కోట్లరూపాయలుగా ప్రకటించింది. కంపెనీ విక్రయాలు జిఎస్‌టి అమలు మాసం కావడంతో కొంతమేర దెబ్బతిన్నట్లు కనిపి స్తోంది. కంపెనీ గత ఏడాది ఇదేకాలంలో 954.95 కోట్లుగా ఉన్నాయి. కార్యకలాపాల ద్వారా రాబ డులు తొలిత్రైమాసికంలో 12,335.56 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది 11,942.9కోట్లతో పోలిస్తే 3.29శాతం పెరిగింది.

కంపెనీ వాహనాల విక్రయా లు 1,12,293 యూనిట్లుగా ఉన్నాయి. వీటిలో ట్రాక్టర్ల విక్రయాలు81,270 యూనిట్లుగా ఉన్నాయి. జిఎస్‌టి అమలు ప్రభావం తొలిత్రైమాసిక వాహన విక్రయాలపై చూపిందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్యాసింజర్‌వాహనాల విక్రయాలు భారీ గా దెబ్బతిన్నాయి. నామమాత్రపు వృద్ధి 4.4శాతం మాత్రమే నమోదయింది.

ఇక భారీ వాహన విక్ర యాలపరంగా కూడా కొంత క్షీణత ఎదురయింది. బిఎస్‌-3వాహనాలపరంగా నాలుగోత్రైమాసికంలో ఉన్నప్రగతి లేదు. బిఎస్‌-4 మోడల్‌ వాహనాలకు డిమాండ్‌, ఉత్పత్తిలపరంగా కొంత మందగమనంతో సాగింది. గడచిన 13 త్రైమాసికాలతో పోలిస్తే తక్కువగా ఉందని అంచనా.ఇక ట్రాక్టర్లపరంగాచూస్తే సాధారణస్థాయికంటే రుతుపవనాలు ఎక్కువ చోటుచేసుకోవడంతో పరిశ్రమపరంగా కొంత అమ్మకాల్లో వృద్ధికనిపించింది. జిఎస్‌టి అనిశ్చితి అస్పష్టత వల్ల జూన్‌నెలలో 1.7శాతం వృద్ధి తగ్గింది. మొత్తంగా దేశీయ ట్రాక్టర్‌రంగం 8.5శాతం వృద్ధితో ఉంది. కంపెనీ పరంగా 13.2శాతం వృద్ధిని నమోదుచేసిందని మహీంద్ర వెల్లడించింది.

జిఎస్‌ఇపరంగా ఎదురవుతున్న భారం అధిగమించేందుకు మహీంద్ర డీలర్ల కోసం రూ.144కోట్లు కేటాయించింది. అంతకుముందు ట్రాక్టర్లను ఎక్సైజ్‌సుంకం నుంచి మినహాయిం చారు. ఇపుడు జిఎస్‌టి చెల్లించాల్సిరావడం వల్ల ఆభారం డీలర్లపై పడకుండా ఉండేందుకు కంపెనీ ముందుగానే అప్రమత్తంఅయింది. కంపెనీషేర్లు 1401.15 రూపాయలుగా బిఎస్‌ఇలో ట్రేడ్‌ అయ్యాయి