క్షీణించిన బజాజ్‌ ఆటో అమ్మకాలు

BAJAJ
Bajaj Bykes

క్షీణించిన బజాజ్‌ ఆటో అమ్మకాలు

న్యూఢిల్లీ, డిసెంబరు 3: బజాజ్‌ ఆటో 13శాతం వాహన అమ్మకాల్లో క్షీణించింది. నవంబరు నెల లో 2,69,948 యూనిట్లను విక్రయిం చింది. అదే గతఏడాది 3,09,673 యూనిట్లను విక్ర యించినట్లు ప్రకటిం చింది.మోటార్‌ సైకి ల్‌ విక్రయాల పరం గాచూస్తే2,70,886 యూనిట్ల నుంచి 2,37,757 యూని ట్లకు పడిపోయా యి.12శాతం క్షీణిం చినట్లు తేలింది. బజాజ్‌ఆటో వాణిజ్యవాహనాల విక్రయాలు 38,787 యూనిట్లనుంచి తగ్గి 17 శాతం క్షీణించి 31,191 యూనిట్లకు పడిపోయా యి. ఎగుమతులపరంగా నవంబరునెలలో చూస్తే 1,37,315 యూనిట్లనుంచి 1,15,425 యూనిట్ల కు పడిపోయాయి. 16శాతం క్షీణించినట్లు తేలింది.