‘క్షణం డైరెక్టర్ సినిమా షూటింగ్ పూర్తి

‘క్షణం’ డైరెక్టర్ సినిమా షూటింగ్ పూర్తి
క్షణం సినిమాతో మంచి విజయం అందుకున్న దర్శకుడు రవికాంత్ రెండో సినిమాను గుంటూర్ టాకీస్ ఫేమ్ సిద్ధ జొన్నలగడ్డతో చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ మూవీని సురేష్‌ప్రొడక్షన్స్‌లో రానా నిర్మిస్తున్నారు.. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా ఉండనున్న ఈచిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది.. వేసవిలో సినిమాను విడుదల చేసే సన్నాహాల్లో యూనిట్ సభ్యులు ఉన్నారు..శీరత్ కపూర్, శ్రధ్ద శ్రీనాధ్, షాలినీ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గుంటూర్ టాకీస్ సినిమా తర్వాత సిద్ధు చేసిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు.. ఈ మూవీని తన కెరీర్‌కు హెల్ప్ అవుతుందని సిద్ధు భావిస్తున్నారు.. ఈసినిమా తర్వాత సిద్ధు నూతన దర్శకుడితో సినిమా చేయబోతున్నారు.. ఆచిత్రం వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.