క్వింటాల్ పత్తి ధర రూ. 5,250

Khammam Market Yard copy
Cotton

ఖమ్మం : పత్తి ధర రోజురోజుకూ పైపైకి పోతోంది. ఏన్కూరు మార్కెట్ యార్డులో అత్యధికంగా రికార్డు స్థ్ధాయిలో జెండాపాట క్వింటాల్‌కు ధర రూ.5250 పలికింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రూ. 5,101 పలికింది. ఈ సంవత్సరానికి గాను ఇదే అత్యధిక ధర కావడం విశేషం. కాగా, ఒకే రోజు దాదాపు 10వేల బస్తాలను వివిధ జిల్లాల నుంచి రైతులు ఖమ్మం మార్కెట్‌కు తీసుకవచ్చారు. రోజురోజుకూ పత్తి ధర పుంజుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.