క్లైమాక్స్‌కు చేరిన రాజీ డ్రామా

Yanamala Ramakrushnudu
Yanamala Ramakrushnudu

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎంపీల రాజీనామాల డ్రామా క్లైమాక్స్‌కు చేరిందని ఏపి ఆర్దిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బిజెపి, వైఎస్‌ఆర్‌సిపిలు కలిసి రాజీ డ్రామా రక్తికట్టించారని అన్నారు. ఉప ఎన్నికలు రావని తెలిసే వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు రాజీనామా డ్రామాలాడారని మంత్రి ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలంటేనే వైఎస్‌ఆర్‌సిపికి భయమని మంత్రి అన్నారు.