క్లాసిక్ హార‌ర్ మూవీగా `అమావాస్య‌`- స‌చిన్ జోషి

Sachin
Sachin

క్లాసిక్ హార‌ర్ మూవీగా `అమావాస్య‌`- స‌చిన్ జోషి

వైకింగ్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌ పై ‘1920 ఈవిల్‌ రిటర్స్స్‌’, ‘రాగిని యంయంఎస్‌, ‘అలోన్‌’ లాంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు భూషన్‌ పటేల్‌ దర్శకత్వంలో రైనా సచిన్‌జోషి, దీపెన్‌ఆమిన్‌ నిర్మాణంలో రైనా సచిన్‌జోషి, నర్గిస్ ఫక్రి హీరో హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘అమావాస్య’. ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతున్న సందర్భంగా…

స‌చిన్ జోషి మాట్లాడుతూ – “నేను చాలా కాలంగా హార‌ర్ సినిమా చేయాల‌ని ఎదురుచూస్తున్నాను. అలాంటి స‌మ‌యంలో భూష‌ణ్ ప‌టేల్ నాకు ఈ స్క్రిప్ట్ గురించి చెప్పారు. నా గ‌త చిత్రాల‌కు ఇది పూర్తి భిన్న‌మైన సినిమా. అమావాస్య ఓ క్లాసిక్ హార‌ర్ మూవీ. తెలుగులో హార‌ర్ చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ దొరుకుతున్న స‌మ‌యంలో మంచి కాన్సెప్ట్‌తో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. ప్ర‌స్తుతం ఉన్న లెటెస్ట్ టెక్నాల‌జీ వి.ఎఫ్‌.ఎక్స్ వ‌ర్క్‌ను ఉప‌యోగించాం. మంచి క‌థే సినిమాకు హైలెట్‌. సినిమాను రెండు భాష‌ల్లో చిత్రీక‌రించాం. ముఖ్యంగా క్లోజ‌ప్ షాట్స్‌ను తెలుగులో చిత్రీక‌రించాం. ఎందుకంటే తెలుగు సినిమాకు నా తొలిప్రాధాన్య‌త ఎప్పుడూ ఉంటుంది. ఈ చిత్రంలో నేను క‌ర‌ణ్ అనే పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. న‌ర్గిస్ ఫ‌క్రి అహానా అనే అమ్మాయి పాత్ర‌లో న‌టించింది. నేను న‌ర్గిస్‌ను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పిన‌ప్పుడు ఆమె వీకెండ్‌లో స‌మ్మ‌ర్ హౌస్‌కి వెళ్లాల‌ని అంటుంది. కానీ హీరోకి ఆ ఇంటికి వెళ్ల‌డం ఇష్టం ఉండ‌దు. అలాంటి స‌మయంలో వారు ఆ ఇంటికి ఎలా వెళ్లారు? అక్క‌డ వారికి ఎలాంటి ప‌రిస్థితులు ఎదురయ్యాయ‌నేదే సినిమా. ఆ వీకెండ్‌లో అమావాస్య రాత్రి ఈవిల్ ఏం చేసింద‌నేదే సినిమా. భూష‌ణ్ ఇప్ప‌టికే 1920 ఈవిల్ రిట‌ర్న్స్‌, రాగిణి ఎం.ఎం.ఎస్‌2, అలోన్‌ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను డైరెక్ట్ చేశారు. అలాంటి హార‌ర్ స్పెష‌లిస్ట్ డైరెక్ట‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. నాకు కూడా హార‌ర్ జోన‌ర్ సినిమాలంటే ఇష్టం. సాధార‌ణంగా హార‌ర్ సినిమాల‌ను డైరెక్ట్ చేసే ద‌ర్శ‌కులు హార‌ర్ సినిమాల‌ను ఎంత ఆస‌క్తికరంగా తెర‌కెక్కించాం.. ఎంత మంచి సౌండ్ టెక్నాల‌జీని ఉప‌యోగించాం అని చూస్తారు. ఇక్కడ క‌థ‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. హాలీవుడ్ స్థాయిలో హార‌ర్ చిత్రాన్ని అందించాల‌ని ఛాలెంజింగ్‌గా భావించి ఈ సినిమా చేశాం. నేను హార‌ర్ సినిమాల‌ను చాలానే చూశాను. అలాగే చాలా స్క్రిప్ట్స్ చ‌దివాను. అయితే భూష‌ణ్ నెరేట్ చేసిన విధానం, స్క్రీన్‌ప్లే నాకు చాలా బాగా న‌చ్చింది. యూనిక్ స్క్రీన్‌ప్లేతో తెర‌కెక్కింది. క‌థ‌కు త‌గ్గ‌ట్లు మ్యూజిక్‌కు త‌గ్గ ప్రాధాన్య‌ముంటుంది. ప‌ర్టికుల‌ర్‌గా నేను హార‌ర్ చిత్రంలో న‌టించ‌డానికి కార‌ణం ఏదీ లేదు. నాకు సినిమాలంటే ప్యాష‌న్‌. చాలా క‌థ‌లు వింటూ ఉంటాను. న‌చ్చిన సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపుతుంటాను. ఫిబ్ర‌వ‌రి 8న మా సినిమా విడుద‌ల‌వుతుంది. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది“ అన్నారు.

భూష‌ణ్ ప‌టేల్ మాట్లాడుతూ – “ఈ సినిమాలో క‌థ‌తో పాటు వి.ఎఫ్‌.ఎక్స్‌కు చాలా ప్రాధాన్య‌ముంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉప‌యోగించ‌ని సాంకేతిక‌త‌ను ఇందులో ఉప‌యోగించాం. బెస్ట్ వి.ఎప్‌.ఎక్స్ టెక్నీషియ‌న్స్ ఈ సినిమాకు ప‌నిచేశారు. దీనికి ఆస‌క్తిక‌ర‌మైన క‌థ కూడా తోడైంది. క్లైమాక్స్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా ఉంటుంది. స‌చిన్‌తో చాలా కాలంగా సినిమా చేయాల‌ని అనుకుంటున్నాను. కానీ ఇద్ద‌రం వారి వారి ప‌నుల‌తో బిజీగా ఉండటం వ‌ల్ల కలిసి సినిమా చేయ‌లేక‌పోయాం. గ‌త ఏడాది ఓ సంద‌ర్భంలో ఇద్ద‌రం క‌లుసుకున్న‌ప్పుడు స‌చిన్‌కు మూడు నిమిషాల ప్లాట్ చెప్పాను. త‌ను ఈ సినిమా క‌లిసి చేస్తున్నామ‌ని చెప్పాడు. త‌న‌నే హీరోగా పెట్టి సినిమా చేయాల‌ని అప్పుడే నేను నిర్ణ‌యించుకున్నాను“ అన్నారు.

అలీ అస్గ‌ర్ మాట్లాడుతూ – “నేను ఈ చిత్రంలో ఆత్మ పాత్ర‌ను చేయ‌లేదు. స‌చిన్‌, న‌ర్గిస్ క‌లిసి వ‌చ్చే వీకెండ్ స‌మ్మ‌ర్ గెస్ట్ హౌస్ కేర్ టేక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటాను. యు.పి రాష్ట్రం నుండి నేను లండ‌న్ ఎలా, ఎందుకు వెళ్లాల‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. హార‌ర్ సినిమాలో నాది కాస్త లైట‌ర్ వేలో ఉండే పాత్ర‌. నా పాత్ర డిజైన్ చేసిన తీరు.. ప్రేక్ష‌కులను న‌వ్విస్తుంది“ అన్నారు.