క్ర‌మంగా పెరుగుతున్న శ్రీశైలం జ‌లాశ‌య నీటిమ‌ట్టం!

Srisailam Dam
Srisailam Dam

కర్నూలుః శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి లక్షా 64వేల క్యూసెక్కుల నీరు వ‌చ్చి చేరుతుండ‌టంతో జలాశయం నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. దీంతో జలాశయం ఆరు గేట్లను ఎత్తివేశారు. నాగార్జున సాగర్‌కు లక్షా 67వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం గరిష్టస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులుగా ఉంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 211 టీఎంసీల నీరు నిలువ ఉంది.