క్రిస్మస్, న్యూ ఇయర్ రెండిటిని కలిపి

Rakul, Nikhil
Rakul, Nikhil

2018 న్యూ ఇయర్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే కొంత మంది తారలు క్రిస్మస్ న్యూ ఇయర్ రెండిటిని కలిపి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. దీంతో ముందే షూటింగ్ లకు సెలవులను పెట్టేసుకున్నారు. ఎన్ని పనులు ఉన్నా సరే పక్కనపెట్టేసి కేవలం ఎంజాయ్ మాత్రమే ఉండాలని ఫిక్స్ అయ్యారు.

అయితే కొంత మంది తమన్నా వంటి హీరోయిన్స్ ని పలు షోల నిర్వాహకులు డ్యాన్స్ పర్ఫెమెన్స్ ఇవ్వాలని కోరారు. రెమ్యునరేషన్ గట్టిగా ఇస్తామని చెప్పడంతో హీరోయిన్స్ ఒప్పేసుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే కొంచెం కొంచెంగా మార్కెట్ రేంజ్ ను పెంచుకుంటున్న నిఖిల్ కూడా 2018 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అందుకోసం పెద్ద షెడ్యూల్ నే వేసుకున్నాడు. మనోడు అమెరికాలోని లాస్ వేగాస్ కి ఈ నెల 27న ఎగిరిపోవాలని ఫిక్స్ అయ్యాడు.

గత కొన్ని రోజులుగా నిఖిల్ షూటింగ్ లతో చాలా బిజీగా ఉన్నాడు. అయితే కొంచెం బ్రేక్ తీసుకొని లైఫ్ ని ఎంజాయ్ మూడ్ లోకి మలచాలని డిసైడ్ అయ్యాడు. జనవరి 15 వరకు తర్వాత మళ్లీ తీరిగి హైదరాబాద్ కు వస్తాడట. ఇక స్టార్ హీరోయిన్ రకుల్ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం స్పెషల్ ప్లాన్ వేసుకుంది. ఈ నెల 28 గోవాకి వెళ్లి అక్కడే ఐదు రోజుల వరకు ఉండనుందని సమాచారం. ఆ పార్టీలో ఇతర స్టార్లు కూడా పాల్గోనున్నారని తెలుస్తోంది.