క్రిస్మస్‌ ఆరాధన

నేడు క్రిస్మస్‌

MERY
MERY

క్రిస్మస్‌ ఆరాధన

యేసుప్రభువు పశువులతొట్టిలో పసిబాలుడుగా పండుకుని, కేరింతలు కొడుతున్న దృశ్యాలే నన్ను వెంటాడుతుండేవి. స్కూల్లో ప్రతిసంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అదే దృశ్యం. దేవదూత మేరీతో మాట్లాడం, గొర్రెల కాపరులు, జ్ఞానులు రావడం, పసిబాలుడిని కీర్తించడం, పాటలు పాడటం, డైలాగులు చెప్పడం..ఇదే క్రిస్మస్‌ సందడి అనుకునేదాన్ని. కానీ దానిలోతుల్లోకి వెళ్లాకకానీ దాని అర్థం, పరమార్థం నాకు అర్థం కాలేదు. రెండువేల సంవత్సరాల క్రితం జన్మించిన యేసు ఇంకా పసిబాలుడిగా లేడని, ఆయన పెరిగి, పెద్దవాడై ఎన్నో అద్భుతాలు చేశాడని, మరణించిన వారిని తిరిగి బ్రతికించాడని, అన్నింటికంటే మిన్నగా నా కోసం సిలువలో ప్రాణాలను అర్పించాడనే వాస్తవం నన్ను ఆశ్చర్యపరిచింది. క్రిస్మస్‌ అంటే నాలుగు పిండివంటలు, చికెన్‌, బిర్యానీ చేసుకోవడం కాదని, క్రిస్మస్‌ అంటే కొత్త దుస్తులు ధరించడం కాదని, క్రిస్మస్‌ అంటే విందు, వినోదం అంతకన్నా కాదని, క్రిస్మస్‌ అంటే శాంటాక్లాజ్‌ చేసే పిచ్చిచేష్టలు కాదని, క్రిస్మస్‌ అంటే చెట్టును ఆర్భాటంగా అలంకరించడం కాదని తెలుసుకున్నాను.

క్రిస్మస్‌ అంటే ‘ఎక్స్‌మస్‌ అంటూ గ్రీటింగ్స్‌ చెప్పుకోవడం కాదని, గ్రీటింగ్‌ సీజన్‌ అసలే కాదని తెలుసుకున్నాను. ‘ఎక్స్‌ అంటే మనం లెక్కలప్పుడు తెలియని దానిగురించి చెప్పుకునేటపుపడు ఎక్స్‌ అని అంటాం. ఎక్స్‌మస్‌ అంటే తెలియని దేవ్ఞడిని ఆరాధిస్తున్నామనే అర్థం కదా? ఇక పిల్లలకు యేసుప్రభువ్ఞ అంటే తెలియదేమో కాని శాంటాక్లాజ్‌ అంటే తప్పక తెలుస్తుంది. కొత్తనిబంధన గ్రంధంలో ఒక్క హేరోదు తన జన్మదినాన్ని పురష్కరించుకుని, అధికారులకు విందు ఏర్పాటు చేశాడు. ‘హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను (మార్కు 6:21). ఈ ఒక్క సందర్భం తప్ప ఎక్కడా ఎవరు జన్మదినోత్సవాన్ని జరుపుకున్నట్లుగా మనం గమనించం. యేసుప్రభువ్ఞ పుట్టినప్పుడు కూడా ఆర్భాటంగా విందు, పండుగ జరుపుకున్నట్లుగా వాక్యంలో చూడం. కానీ పాపంలో పడి కొట్టుమిట్టాడుతున్న వారు తమను ఈ పాపపు బంధం నుంచి విడిపించేందుకు ఒక వ్యక్తి జన్మిస్తాడని, అతడు తన ప్రజల పాపభారాన్ని తీసివేస్తాడని లేఖనాల ద్వారా గ్రహించిన యూదులు, ఇతర జాతుల ప్రజలు ఆయన రాకడకోసం నిరీక్షించారు. వారి నిరీక్షణ ఫలించింది. యేసుప్రభువ్ఞ జన్మించాడు. నిజంగా ఇది మనకందరికీ పండుగే. ఆనందంగా మనం పండుగ జరుపుకోవాల్సిందే. ఎందుకంటే తన ప్రజలను వారి పాపం నుంచి విడిపిస్తాడు కావ్ఞన, ఆయన ద్వారా మనం పరలోకానికి వెళ్లే గొప్ప ఆధిక్యత లభించింది కావున ఇది మనకు పండుగే. ఆనందంగా ఉత్సహించాల్సిందే. కానీ రానురాను క్రిస్మస్‌ అర్థమే మారిపోతున్నది. క్రిస్మస్‌ అంటే యేసుప్రభువ్ఞను మనం ఆరాధించాలి. క్రిస్మస్‌ అంటే ప్రభువ్ఞను కీర్తిస్తూ, మనం ఆనందించాలి. క్రిస్మస్‌ అంటే ఆయనను హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరించి, ఆయనను వెంబడించడం.

ఆయన కోసం నిరీక్షించే వారికి నిజంగా సంవత్సరమంతా హ్యాపీక్రిస్మసే అనిపిస్తుంది. కానీ విచారకరమైన అంశం ఏమంటే క్రిస్మస్‌ అంటే ప్రభువ్ఞ కంటే శాంటాక్లాజ్‌యే ప్రముఖంగా కనిపిస్తుంటాడు. శాంటాక్లాజ్‌ డబ్బును, బహుమతులను సేకరించి నిరుపేద దేశాలకు, అనాధులకు కానుకలను పంపించే మానవీయగుణం హర్షణీయే అయినా..ఆయనకెందుకింతగా ప్రాధాన్యతనిస్తున్నారు? అసలు క్రిస్మస్‌ అంటే ప్రభువ్ఞను ఆరాధించడమా లేక శాంటాక్లాజ్‌ను చూసి కేరింతలు కొట్టడమా! ఏ షాపింగ్‌మాల్స్‌లలో చూసినా, టీవీ ప్రకటనల్లో చూసినా, చివరకు చిన్నపిల్లల ప్రోగ్రామ్స్‌లలో ప్రభువ్ఞను మరుగుపర్చి, శాంటాక్లాజ్‌ను గొప్పగా చేసి చూపించడం ఎంతవరకు సమర్ధనీయమో ఆలోచించాలి. క్రిస్‌+మాస్‌= క్రిస్మస్‌ అంటే క్రీస్తును మాస్‌గా ఆరాధించడం. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రజలు ఒకచోట చేరి, ఆరాధించడం, కీర్తించడం. శాంటాక్లాజ్‌ను కాదు.

ఇక క్రిస్మస్‌ ట్రీ అని పెట్టేసి, దానికి డెకరేషన్‌ చేసి, లేనిపోని ఆర్భాటాలకు అవకాశాన్నిస్తున్నారు. చెట్టు పచ్చదనాన్నిస్తుంది. మొక్కలు, చెట్లవల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. కానీ క్రిస్మస్‌ పండుగకు, ట్రీకి ఏమాత్రం సంబంధం లేదు. ఒకవిధంగా గమనిస్తే ఈ ట్రీని ఇంట్లో పెట్టి, దాన్ని డెకరేషన్‌ చేసి, ఒక విగ్రహంగా భావిస్తూ, ప్రభువ్ఞ జన్మించిన ఉద్దేశాన్ని మర్చిపోతున్నామేమో! ఈ సీజన్‌లో ఒక్క నక్షత్రానికి (స్టార్‌) తప్ప దేనికీ ప్రాధాన్యతనివ్వకూడదు. ‘యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు?తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి (మత్తయి 2:2). ఆకాశంలో వింతగా, మరింత కాంతివంతంగా ప్రకాశిస్తున్న నక్షత్రాన్ని చూసిన జ్ఞానులు, ప్రభువును పూజించేందుకు వచ్చారు. చివరకు ఆ నక్షత్రమే వారిని ప్రభువ్ఞ చెంతకు చేర్చింది. జ్ఞానులు తొట్టిలో పండుకుని ఉన్న శిశువును, తల్లి అయిన మరియను చూసి, బంగారు, సాంబ్రాణి, బోళమును కానుకలుగా సమర్పించి, ఆరాధించారు.

ఇదే నిజమైన ఆరాధన. గొర్రెల కాపరులు కూడా యేసును చూసి, పూజించారు. ప్రభువ్ఞను హృదయంలో చేర్చుకుని, రక్షణ అనుభవంతో మాత్రమే కాదు, ప్రభువ్ఞ ప్రేమను ప్రతిదినం అనుభవిస్తూ, సేవించేవారికి నిత్యమూ ఆనందమే. సంతోషమే. ఈ అనుభవంతో ఆయనను ఆరాధించాలని ప్రభువ్ఞ ఆకాంక్ష. అంతేతప్ప ప్రభువ్ఞకు ఏమాత్రం ప్రాధాన్యతలేకుండా ఎంత గొప్పగా, ఆర్భాటంగా చేసుకున్నా, అదంతా సంప్రదాయాల్లో ఒక భాగమే తప్ప నిజమైన ఆనందం లేని క్రిస్మస్‌గా ప్రతి సంవత్సరం డిసెంబరు 25వ తేదీ వచ్చినట్లుగానే ఈ సంవత్సరం కూడా వస్తుంది, వెళ్లిపోతుంది. కానీ నిత్యం నిలిచిపోయేది, వాడిపోనిది, సంతోషాన్నిచ్చేది ‘రక్షణ అనేది మాత్రమే. ప్రభువ్ఞను మనసునిండా నింపుకుని, ఆనందంగా ఆయనను పూజించే ధన్యత, ఆనందం లేకుండా ఆచారాలు, సంప్రదాయాల పేరుతో ఉత్సవాల మాటులో రక్షణ ఆనందాన్ని కోల్పోకూడదు. కాబట్టి ఒక్కసారి మనసుపెట్టి ఆలోచిస్తే మనకే అర్థం అవ్ఞతుంది. క్రిస్మస్‌ పేరుతో ప్రభువ్ఞను మనం ఎంతగా నొప్పిస్తున్నామో గ్రహించి, దేవ్ఞడికి దక్కాల్సిన మహిమ, ఘనత శాంటాక్లాజ్‌కు, క్రిస్మస్‌ట్రీకి ఇవ్వకుండా, అర్థవంతంగా క్రిస్మస్‌ జరుపుకుందాం. అదే ప్రభువ్ఞకు మనం ఇచ్చే నిజమైన కానుక.

-పి.వాణీపుష్ప