క్రిస్టల్‌ బార్‌లో అగ్ని ప్రమాదం

Fire Crystal bar
Fire Crystal bar

హైదరాబాద్‌: నగరంలో సంతోష్‌నగర్‌ ఠాణా పరిధిలో గల క్రిస్టల్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో నేడు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రెస్టారెంట్‌లో గల రెండో అంతస్తులో కిచెన్‌లో మొదట మంటలు చెలరేగాయని సంతోష్‌నగర్‌ ఏసిపి తెలిపారు. అదృష్టవశాతుత కిచెన్‌లో ఉన్న గ్యాస్‌ సిలిండర్లు మంటల ప్రభావానికి పేలలేదని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే క్రిస్టల్‌బార్‌ వద్దకు చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.