క్రమశిక్షణ అలవడాలంటే…

girl
girl

క్రమశిక్షణ అలవడాలంటే…

పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచాలనుకునే తల్లిదండ్రులు ముందుగా తాము ఓ క్రమపద్ధతిలో నడుచుకునేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే పిల్లలు తమ తల్లిదండ్రుల్నే అనుసరించాలని చూస్తారు గనుక. వారు ఓ క్రమబద్ధమైన ప్రవర్తనతో పిల్లలకు ఆదర్శనీయంగా కనబడాలి. పిల్లలు ఏం చేయాలో, ఏం చేయకూడదో ఖచ్చితంగా చెప్పగలగాలి. వాళ్లు కొన్ని నచ్చని పనులు చేసినపుడు తల్లిదండ్రులు ప్రేమతో సహించగలగాలి. ప్రేమ, స్వాతంత్య్రం పిల్లల ఎదుగుదలకు కావలసిన మౌలిక అవసరాలు. పిల్లలు మనకు నచ్చని పనులు చేసినపుడు విమర్శించటం కన్నా, వాళ్ల సరైన పనులు చేసినపుడు మెచ్చుకోవటం ముఖ్యం. అలా వాళ్ల సరైన పనులే చేసేందుకు ప్రోత్సహించాలి. క్రమశిక్షణ తప్పిన పిల్లలకు పాకెట్‌ మనీ మానేయడం, వారికి ఇతర హక్కుల్ని తగ్గించటం అనేది చాలా పొరపాటు. తల్లిదండ్రులిద్దరూ ఒకేమాట మీద ఉండాలి.