క్యూట్‌ లవ్‌స్టోరీ కాదు

RGV, AKHIL
RGV, AKHIL

క్యూట్‌ లవ్‌స్టోరీ కాదు

దర్శకుడురామ్‌ గోపాల్‌వర్మ అఖిత్‌తో చేయబోయే సినిమాను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నాగార్జునతో ‘శివ లాంటి సినిమా చేసిన వర్మ అఖిల్‌తో సినిమా చేస్తున్నారనగానే సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.. వర్మమాత్రం ఈసినిమా క్యూట్‌ లవ్‌స్టోరీగా ఉండదని క్లారిటీ ఇచ్చేశారు.. అలాగేసినిమా మొత్తం ఇంటెన్స్‌ యాక్షన్‌ డ్రామాగా ఉంటుందని, అందులోబలమైన లవ్‌స్టోరీ కూడ ఉంటుందని, వయొలెన్స్‌ , ప్రేమ కలిసి ఉంటాయని అన్నారు. ప్రస్తుతం వెంకీ అట్లూరితో ఒకసినిమాను మొదలుపెట్టనున్న అఖిల్‌ అది పూర్తవగానే వర్మ సినిమాను స్టార్ట్‌ చేయనున్నారు.. ఈచిత్రాన్ని నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు.