క్యాంపస్‌ నియామకాలపై ఇన్ఫోసిస్‌

infosys
infosys

క్యాంపస్‌ నియామకాలపై ఇన్ఫోసిస్‌

బెంగళూరు, మే 19: దేశంలోని రెండో అతిపెద్ద ఐటి సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ ఈ ఏడాది క్యాంపస్‌ల ద్వారా 20వేల మందిని నియమించుకునేందుకు నిర్ణయించింది. అయితే వీరిలో డిజిటల్‌, అనలి టిక్స్‌ విభాగాల్లో మంచినైపుణ్యం ఉన్న ఇంజనీర్లుకు మాత్రమే దక్కుతుంది. ఐటిసంస్థలకు దేశంలో టెక్నాలజీ, బిజినెస్‌ మార్పులు అనేకంగా చోటుచేసు కుంటున్నాయి. గడచిన కొన్నేళ్లుగా ఐటిసంస్థల క్లయింట్లకు కోరినవిధంగా సేవలందించేందుకు వీలుగా డిజిటల్‌, క్లౌడ్‌, అనలిటిక్స్‌పై ఎక్కువ ఖర్చుచేస్తున్నాయి. నిర్వహణ, టెస్టింగ్‌సేవలు అత్యధికంగా కొత్తగా వచ్చిన ఇంజనీర్లచేతనే చేయి స్తున్నారు. వీటిని కూడా త్వరలోనే యాంత్రీకరణ చేస్తున్నాయి. ఇన్ఫోసిస్‌ ఇతర పోటీసంస్థలకు కొత్త నైపుణ్యంవైపు దృష్టిసారిస్తున్నాయి. ఇన్ఫోసిస్‌తన వార్షిక నియామక జాతాను సెప్టెంబరులో ప్రారం భిస్తుందని ఇన్ఫోసిస్‌ అధికార ప్రతినిధి వివరించా రు. ఇంజినీరింగ్‌ కళాశాల్లో జరిగే ఈ నియామక ప్రక్రియ ఫిబ్రవరివరకూ కొనసాగుతుంది.

మూడు, నాలుగు త్రైమాసికాల్లోనే ఐటి కంపెనీలు ఎక్కువ నియామకాలు చేపడతాయి. దశలవారీగా కొత్త సిబ్బందిని చేర్చుకుంటుంటాయి. ఐటి ఉత్పత్తిసంస్థ ల జాతీయ సంఘం నాస్కామ్‌ అంచనాలప్రకారం చూస్తే ఐటిసేవలరంగం పరిమాణంనుంచి నైపుణ్యం వైపు పరుగులు తీస్తున్నదని అందుకే నైపుణ్య తర్ఫీ దు, శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్లు వివరిం చింది. తమ సంస్థపరంగా 95శాతం చివరిసం వత్సర విద్యార్థులకు ఉపాధి లభించింది. వచ్చే ఏడాది నుంచి కంపెనీలు ఇటీవలి మార్పులతో ఎలా స్పందిస్తాయో చూడాలని బెంగళూరు ఆర్‌వికాలేజి యాజమాన్యం చెపుతోంది

ఈ నెలలోనే పదివేల మందిని నియమించుకుంటామని, అమెరికాలో వచ్చే రెండేళ్లపాటు ఈ నియామకాలుంటాయని ప్రకటించింది. కొత్త టెక్నాలజీ ఇన్నొవేషన్‌ హబ్స్‌ అమెరికా మొత్తం ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. కృత్రిమ ఇంటిలిజెన్స్‌, యాంత్రీకరణ శిక్షణ, విని యోగదారుల అనుభవాలు, డిజిటల్‌ టెక్నాలజీ, క్లౌడ్‌, బిగ్‌డేటాలపై తమ ప్రాధాన్యతఎక్కువ ఉం టుందని ప్రకటించింది.టెక్నాలజీపరంగా తమ బిజినెస్‌ మోడల్‌ మారుతుందని, యాంతీకరణ, ఉత్పాదకత పెంపునకు అవసరమైన కార్యాచరణ అమలు చేస్తామ ని చీఫ్‌ఆపరేటింగ్‌ అధికారి ప్రవీణ్‌రావు వెల్లడించారు.