కోహ్లీ నంబర్‌ 1ను చెరిపేసిన ఆమ్లా

Amla

కోహ్లీ నంబర్‌ 1ను చెరిపేసిన ఆమ్లా

ఇంగ్లాండ్‌: దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ హషీమ్‌ ఆమ్లా విరాట్‌ కోహ్లీ పరుగుల రికార్డును అధిగమించేశాడు. వన్డేల్లో వేగంగా ఏడువేల పరుగుల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆమ్లా 54బంతుల్లో 55పరుగలు చేయడం ద్వారా వన్డేల్లో వేగంగా ఏడువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. విరాట్‌ 161 మ్యాచ్‌ల ద్వారా 7వేల పరుగులు చేయగా, ఆమ్లా 150వ మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు. కొద్ది నెలల క్రితం కోహ్లీ మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ (174) దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఎబి డివిలియర్స్‌(166), బ్రియన్‌ లారా(183)ల రికార్డును చెరిపేసి నంబర్‌ వన్‌లో నిలవగా, ఇప్పుడు కోహ్లీ రికార్డు బద్దలయ్యింది. 34ఏళ్ల ఆమ్లా ఈఏడాది ఫిబ్రవరిలో లంకపై 154పరుగులతో 24సెంచరీలకు చేరుకున్నాడు. అతని ఖాతాలో 32అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి, ఆమ్లా కంటే కోహ్లీ ఆరేళ్ల జూనియర్‌. కోహ్లీ 179 వన్డేల్లో 7,755 పరుగులు చేశాడు. ఇందులో 27సెంచరీలు ఉండటం గమనార్హం.