కోహ్లీ దూకుడుతో సచిన్‌ నం.1 రికార్డు బ్రేక్‌

Kohli, Sachin
Kohli, Sachin

కోహ్లీ దూకుడుతో సచిన్‌ నం.1 రికార్డు బ్రేక్‌

దంబుల్లా: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లక్ష్య ఛేదనలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. శ్రీలంకతో దంబుల్లా వేదికగా జరిగిని తొలి వన్డేలో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (132)తో పాటు కోహ్లీ (82) దూకుడుగా ఆడటంతో 217 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 28.5ఓవర్లలోనే ఛేదించేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 44వ అర్థశతకాన్ని పూర్తి చేసుకున్న కోహ్లీ…ఛేదనలో వేగవంతంగా 4వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ 124 ఇన్నింగ్స్‌ల్లో 4వేల పరుగుల (ఛేదనలో) ఈమైలురాయిని అందుకుని భారత్‌ తరుపున అగ్రస్థానంలో ఉండగా…విరాట్‌ కోహ్లీ కేవలం 64 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకుని ఆ రికార్డుని కనుమరుగు చేశాడు. రికీ పాంటింగ్‌ ఈ మైలురాయిని 104 ఇన్నింగ్స్‌లో అందుకున్నా…తాజాగా అది కూడా బద్దలైపోవడం విశేషం. అయితే…ఛేదనలో ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో మాత్రం సచిన్‌ 5490 పరుగులతో నెం.1గానే కొనసాగుతున్నాడు. అతని తర్వాత రికీ పాంటింగ్‌ 4186…ప్రస్తుతం మూడో స్థానంలో కోహీల 4001 పరుగులతో కొనసాగుతున్నాడు.