కోహ్లీ అర్ధశతకం…

Virat kohli
Virat kohli

బర్మింగ్‌హోమ్‌: ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ను గెలిపించేందుకు భారత్‌ క్రికెట్‌జట్టు సారథి విరాట్‌ కోహ్లీ ఒంటరి పోరు సాగించారు. ఓవైపు అతిథ్య బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నా ఎలాంటి ఆందోళన, ఒత్తిడికి గురి కాకుండా పరుగులు సాధించాడు. పేసర్లు వేస్తున్న పదునైన బంతులను బౌండరీలు బాదుతూ భారత్‌ను లక్ష్యానికి చేరువగా తీసుకొచ్చాడు. ఈ మేరకు 88బంతుల్లో 4ఫోర్లతో విరాట్‌ అర్ధశతంకం పూర్తి చేశారు. అర్ధశతకం పూర్తి అయిన కొద్దీ సేపటికే బెన్‌స్టోక్‌్‌స బౌలింగ్‌లో అవుటయ్యారు. రివ్యూ కోరినా థర్డ్‌ ఎంపైర్‌ కోరినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో విరాట్‌(51) నిరాశగా పెవిలియన్‌కు చేరారు. అదే ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మహ్మద్‌ షమీ కీపర్‌ బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరారు. అంతకు ముందు నాల్గో రోజు ఆట, శనివారం తొలి ఓవర్‌లోనే భారత్‌ వికెటల్‌ కోల్పోయింది. అండర్సన్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ దినేష్‌ కార్తీక్‌ తొలి ఓవర్‌లోనే ఔట్‌ అయి ఆరో వికెట్‌కు పెవిలియన్‌కు చేరారు.