కోహ్లీసేనపై నలుగురి బౌలర్ల వ్యూహం : శ్రీలంక

Team India
Team India

కోహ్లీసేనపై నలుగురి బౌలర్ల వ్యూహం : శ్రీలంక

కోల్‌కతా: కోహ్లీసేనపై నలుగురు బౌలర్ల వ్యూహంతో మైదానంంలోకి దిగుతామని శ్రీలంక సారథి దినేశ్‌ ఛండీమాల్‌ సూచన చేశారు. యూఏఈలో ఉష్ణ వాతావరణంలో పాకిస్తాన్‌పై విజయవంతమైన ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని భారత్‌లో అమలు చేయనున్నారు. పాకిస్తాన్‌పై మేం ఆరుగురు బ్యాట్స్‌మెన్‌, ఐదుగురు బౌలర్లతో ఆడాం. ఉక్కపోత వాతావరణంలో ఈ వ్యూహం అద్భుతంగా పనిచేసింది. అక్కడ నలుగురు బౌలర్లతో ఆడి గెలవడం సులభం కాదు. కానీ టీమిండియాలో అత్యుత్తమ బౌలర్లు ఉన్నారు. అందుకే మేం ఆల్‌రౌండర్‌ గురించి ఆలోచిస్తున్నాం. పిచ్‌ను పరిశీలించిన తర్వాత మా ప్రణాళికలు సిద్ధం చేస్తామని చండీమాల్‌ అన్నారు. శ్రీలంక 1982 నుంచి భారత్‌లో ఒక్క టెస్టైనా గెలవలేదు. సొంతగడ్డపై ఈ ఏడాది జరిగిన సిరీసుల్లో కోహ్లీసేన చేతిలో క్లీన్‌స్వీప్‌ అయింది. టెస్టుల్లో 5-0, వన్డేల్లో 3-0, టీ20లో 1-0తో వైట్‌ వాస్‌ అయింది. అందుకే ప్రస్తుత సిరీస్‌ను కుర్రాళ్లు సవాల్‌గా తీసుకున్నారని చండీమాల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం టీమిండియా నంబర్‌వన్‌ జట్టని తెలుసు. గత రెండేళ్లుగా వారు నాణ్యమైన క్రికెట్‌ ఆడుతున్నారు. మేం పాక్‌పై బాగా ఆడాం. చక్కని బృంద ప్రదర్శన కనబరిచాం. కుర్రాళ్లు ఈ సవాల్‌ను ఎదుర్కొంటారని ఆశిస్తున్నా. ఏంజెలో మాథ్యూస్‌, రంగనా హెరాత్‌ను మినహాయిస్తే నాతో సహా అందరికీ ఇదే భారత్‌లో తొలి పర్యటనని తెలిపారు.