కోహ్లీతో వివాదం కలిసొచ్చింది : డిక్వెల్లా

Kohli, Dewkella
Kohli, Dewkella

కోహ్లీతో వివాదం కలిసొచ్చింది : డిక్వెల్లా

కోల్‌కతా: భారత్‌-శ్రీలంక మధ్య ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్టు చివరి రోజు ఆటలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. లంక మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు కావాలని సమయం వృథా చేస్తుందని మ్యాచ్‌ చూసిన ప్రతి ఒక్కరూ అభిప్రాయపడ్డారు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందో తాజాగా శ్రీలంక ఆటగాడు డిక్వెల్లా వివరించాడు. 14.3వ ఓవర్‌లో షమి వేసిన బంతిని సిక్స్‌గా మలిచాను.

అంతకుముందే స్క్వేర్‌ లెగ్‌లో ముగ్గురు ఫీల్డర్లు ఉన్నట్లు గుర్తించా. ఇది నిబంధనలకు విరుద్ధం. ఇదే విషయాన్ని అంపైర్‌ దృష్టికి తీసుకెళ్లా. దీంతో అంపైర్‌ షమీ వేసిన మూడో బంతిని నోబాల్‌గా ప్రకటించారు. అప్పుడు కోహ్లీ వచ్చి అది నీ జాబ్‌ కాదు. నువ్వు ఏమి ఆందోళన చెందకు అన్నాడు.

అసలు వివాదం అప్పుడే మొదలైంది. అప్పుడే అనుకున్నాడను. కోహ్లీతో ఏదైనా వాదన పెట్టుకుంటే సమయం వృథా చేయవచ్చు కదా అని. నా ఉద్ధేశాన్ని కోహ్లీ సరిగ్గా అందుకున్నాడు. ఆ తర్వాత 19వ ఓవర్‌లో షమి సంఘటన జరి గింది. అంతా నేను అనుకున్నట్లే జరిగింది. ఈ వ్యూహాత్మక వివాదంలో నేనే గెలిచానని డిక్వెల్లా తెలిపాడు. 19వ ఓవర్‌లో రెండో బంతి వేసిన అనంతరం షమి నా వద్దకు వచ్చి ఇటు చూడు. నేను లోకల్‌ బా§్‌ుని. కోల్‌కతా నుంచి వచ్చానని అన్నాడు. నీమాటలకు నేను దీటుగా బదులి వ్వాలని అనుకోవట్లేదు. బాగా బౌలింగ్‌ చేస్తున్నావు.

మంచి బౌన్స్‌,పేస్‌తో అని అన్నాను. దానికి సంతృప్తి చెందిన షమీ వెనక్కి వెళ్లిపోయాడు. నేను అనుకున్నట్లే అక్కడ కొంచెం సమయం వృథా అయ్యింది. నాలుగో బంతి తర్వాత కూడా కొంత సమయం వృథా అయ్యింది. దీంతో నేను చాలా సంతోషంగా ఫీలయ్యాను. నేను బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ చేసే సమయంలో ఎవరిపై ఆధిపత్యం చెలాయించాలని అనుకోను. ఒక గేమ్‌ మీద తప్ప. విరాట్‌ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ అని అందరికీ తెలుసు. అతడికి దూకుడు ఎక్కువ అని తెలుసు కాబట్టే ఈ డ్రామా అంతా జరిగిందని డిక్వెల్లా వివరించాడు.