కోల్‌ ఇండియాకు నష్టాల పర్వం!

coal
coal

కోల్‌ ఇండియాకు నష్టాల పర్వం!

ముంబయి, మే 31: కోల్‌ ఇండియా నికరలాభాల్లో భారీ క్షీణత చవిచూసింది. షేర్లు కూడా 2.8శాతం క్షీణించి రూ.260కి పడిపోయాయి. 2014 మార్చి 21వ తేదీనాటి పతనదశను చూపింది. నికరలాభాల్లో 38శాతం పతనం అయి 2716 కోట్లుగా నమోదు చేయడమే ఇందుకుకీలకం. కంపెనీ అంతకుముందు ఏడాది నాలుగో త్రైమాసికంలో 4398 కోట్లు నికర లాభం చవిచూసింది. నిర్వహణ రాబడులు ఈ త్రైమాసికంలో 8.6శాతం పెరిగి 24,780 కోట్లకు చేరాయి. విద్యుత్‌ డిమాండ్‌, ఇవేలంల నుంచి అంత గా ఆశించిన రాబడులు లేకపోవడం, ధరల్లో పెరుగు దల వంటివి నికరలాభాలపై ప్రభావం చూపించింది. ఈ త్రైమాసికంలో ఉద్యోగులకు 9229 కోట్లు వ్యయం చేశామని, వార్షికపద్ధతిలో చూస్తే 7843 కోట్ల కంటే ఎక్కువగా ఉందని అంచనావేసారు. ఈ మొత్తం ప్రకారంచూస్తే మొత్తం ఖర్చులు 23శాతంపెరిగి 22,358 కోట్లకు చేరాయి. బొగ్గు ఉత్పత్తి పరంగా చూస్తే కోల్‌కత్తా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ 80శాతం దేశ ఉత్పత్తిలో వాటాతో ఉంది. నాలుగో త్రైమాసికంలో 176.37మిలియన్‌ టన్నులు ఉత్పత్తిచేసింది.

అంతకుముందుఏడాది 165.24 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి చేసిన కంపెనీ ఎంతో ముందంజలో ఉంది. కంపెనీ స్టాక్‌ మంగళవారం భారీ పతనం నమోదు చేసింది. బిఎస్‌ఇలో 79వేల షేర్లు చేతులుమారాయి. సగటున 4.51 లక్షలషేర్లు గడచిన త్రైమాసికం నుంచి చేతులు మారినట్లు అంచనా. గతంలో గరిష్టంగా స్టాక్‌ విలు వలు రూ.260 నుంచి రూ.263.50లకు చేరింది. కంపెనీషేర్లు 1.9శాతం దిగజారి 262కి చేరాయి. =======