కోల్ఇండియా సంస్థల్లో సింగరేణి ఫస్ట్: కెసిఆర్
హైదరాబాద్: దేశంలోని కోల్ ఇండియా సంస్థల్లో సింగరేణి అత్యుత్తమ ఫలితాలు సాధించి నెంబర్ వన్‌గా నిలిచిందని తెలంగాణ సిఎం కెసిఆర్ అన్నారు.. సింగరేణి సిఎండి శ్రీదర్్ సోమవారం ఇక్కడ కెసిఆర్‌తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా సింగరేణి లాభాల్లో డివిడెంట్ రూ.66.42 కోట్ల విలువైన చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, సింగరేణి రూ.490 కోట్ల లాభాలు సాధించిందని ఆయన తెలిపారు. తెలంగాణలో మరో 50 ఏళ్లకు సరపడా బొగ్గు నిల్వలున్నాయని, అయినా ఇతర ప్రాంతాల్లోని గనులు నిర్వహించాలని ఆయ ఆదేశించారు.