కోల్‌ఇండియాలో 20శాతం వేతనాల పెంప

COAL
COAL

కోల్‌ఇండియాలో 20శాతం వేతనాల పెంపు

కోల్‌కత, అక్టోబరు 11: కోల్‌ఇండియా నాలుగు కార్మిక సంఘాలు తమ వేతనాలు 20శాతం వరకు పెంచడానికి, అలాగే డిఎ నాలుగు శాతం పెంచడానికి మంగళవారం అంగీకరించారు. కార్మిక సంఘా లకు, కోల్‌ఇండియా బిఎస్‌ఇకి మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఈ జీతాల పెంపుదల వలన ఏడాదికి అదనంగా 3500కోట్ల నుండి 4వేల కోట్ల వరకు పెరుగుతుంది. కంపెనీ గత ఏడాది వేతనాలకు ఇతర చెల్లింపులకు 33,514కోట్లు ఖర్చుపెట్టింది. కోల్‌ ఉత్పత్తి వ్యయంలో 50శాతం వేతనాలకే చెల్లించవలసి వస్తుంది. అయినప్పటికి వేతనాల పెరుగుదల వల్ల 3000వేల కోట్లు అదనంగా భరించవలసి వస్తుంది. ఈ వేతనాల పెంపు 2016 జూన్‌ నుంచి వర్తిస్తుంది. ప్రతి ఐదేళ్లకోసారి వేతనాల పెంపుకు సంబంధించి చర్చలు జరుపవలసి ఉన్నప్పటికి గత ఏడాది 25శాతం వరకు పెంచడానికి ఒప్పుకుంది. కానీ అదేవిధంగా ఈ ఏడాది వేతనాలు పెంచే సామర్థ్యంలేక గత ఏడాది నుండి చర్చలు సాగుతున్నాయి.