కోర్టు తీర్పులను ఆయా ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేయాలి..

Ramnath Kovind
Ramnath Kovind

తిరువనంతపురం: శనివారం కేరళ హైకోర్టు వజ్రోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
దేశంలో హైకోర్టులు ఇచ్చే తీర్పులు ఆయా ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేయాలని, కోర్టులు ప్రజలకు న్యాయమైన తీర్పులు ఇవ్వడమే కాదు,
వారికి అర్థమయ్యే భాషలోను వాటిని అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. ‘మన దేశంలో ఎన్నో భాషలున్నాయి, న్యాయస్థానాలు
ఇంగ్లీషులో తీర్పు ఇవ్వడం వల్ల ఆ భాష రాని వారు దాన్ని అర్థం చేసుకోలేరు. అందువల్ల న్యాయవాదులు, ఇతర వ్యక్తులను సంప్రదించాల్సి
వస్తుంది. దీంతో సమయంతో పాటు డబ్బు వృధా అవుతుంది అని అన్నారు. కేసుల విచారణలో జాప్యం వల్ల ఎంతో మంది ఇబ్బందులు
పడుతున్నారు. అందువల్ల ముఖ్యమైన కేసుల విచారణలో వాయిదాలను నివారించి వీలైనంత త్వరగా కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు
తీసుకోవాలి అని సూచించారు.