కోరికతీరిస్తే పంటరుణం మంజూరు

CBI 2
C B I

నాగ్‌పూర్‌: మహారాష్ట్రలో ఒక ప్రభుత్వరంగ బ్యాంకు మేనేజర్‌ తన కోరికతీరిస్తే బ్యాంకురుణం మంజూరుచేస్తానని ఒక రైతు మహిళను వేధించిన ఫిర్యాదుపైకేసు నమోదు అయింది. పంటరుణం మంజూరుకావాలంటే తన కోరిక తీర్చాలని వేధిస్తున్నట్లు రైతు మహిళ తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదుచేసింది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దతాలా శాఖ మేనేజర్‌ రాజేష్‌ హివాసే ఈ వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగేఆమెపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వాంఛలు తీర్చాలని పట్టుబడుతూ వస్తున్నాడు. అంతేకాకుండా బ్యాంకు తన కిందిస్థాయి ఉద్యోగిని ఆమె ఇంటికి పంపించి మరీ వేధిస్తున్నట్లు తేలింది. పంటరుణం మంజూరుచేసే నెపంతో బ్యాంకు మేనేజర్‌ ఆ మహిళ కాంటాక్టు వివరాలు మొత్తం తెలుసుకుని రుణం మంజూరుకు కృషిచేస్తామని చెపుతూనే మొబైల్‌కాల్స్‌చేస్తూ కోరికతీర్చాలని వెంటపడుతున్నాడు. దీనితో రైతు దంపతులిద్దరూ మేనేజర్‌ ఫోన్‌ సంభాషణను రికార్డుచేసి పోలీసులకు అందించారు. అంతేకాకుండా మేనేజర్‌ తన ప్యూన్‌ను ఇంటికి పంపించి మేనేజర్‌ కోరికతీరిస్తే అన్నీ చూసుకుంటారని నమ్మబలికించేయత్నంచేసాడు చవాన్‌ అనే ఈప్యూన్‌ రైతు నివాసానికి వచ్చి రైతు మహిళతో బ్యాంక్‌మేనేజర్‌కు ఫోన్‌చేయించాలని చెపుతూ వచ్చాడు. ఇదంతా రికార్డుచేసిన రైతు దంపతులు పోలీసులకు ఫిర్యాదుచేయడంతోకేసునమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు మల్కాపూర్‌ తహసీల్‌ డిసిపి గిరీష్‌ భోబ్డే వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరూ పరారీలో ఉన్నారని వెల్లడించారు.