కోరలు చాచిన ‘కట్టలపాములు

2000 currency bundles
2000 currency bundles

కోరలు చాచిన ‘కట్టల పాములు

 

పూణె: ఇక్కడి బ్యాంక్‌ మహారాష్ట్ర శాఖలో ఐటి అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 లాకర్లనుంచి రూ.10.8 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ.8.8 కోట్లు కొత్త రూ.2000 నోట్లు ఉన్నాయి.. కాగా ఈ 15 లాకర్లు కూడ ఒక వ్యక్తి పేరట ఉన్నట్టు గుర్తించారు.

తండ్రీకొడుకుల నుంచి రూ.5.58 కొత్త కరెన్సీ స్వాధీనం

గువహటి: గువహటిలో పోలీసులు గురువారం సోదాలునిర్వహించారు.. రూ.5.58 లక్షల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు.. నగరంలో తండ్రి , కొడుకుల నుంచి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

మహారాష్ట్రలో తనిఖీలు

మహారాష్ట్ర: ఖడక్‌పాద ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.. రూ.21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.. పట్టుబడిన నగదులో రూ.16 లక్షలు విలువైన కొత్త రూ.2000 నోట్లు, రూ.500 నోట్లు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.