కోపం ప్రదర్శిస్తేనే మేలు

ANGRY1

ANGRY1

This slideshow requires JavaScript.

కోపం ప్రదర్శిస్తేనే మేలు

”తన కోపమే తనకు శత్రువు అన్న పాత సూత్రం ఎప్పటికీ వర్తించేది. అయితే అది మితిమీరే కోపం, అసహజమైన కోపం విషయంలోనే అంటున్నారు మానసిక నిపుణులు. మామూలుగా కాస్త కోపం వచ్చినపుడు దాన్ని అణచుకోకుండా బయటపెట్టడమే ఆరోగ్యానికి మేలు చేస్తుందనేది నేటి నిపుణుల మాట. ”ఈ అమ్మాయికి అస్సలు కోపం రాదు అనిపించుకోవటం గొప్ప కితాబు కాదంటున్నారు. వచ్చిన కోపాన్ని అణుచుకోవడం కొత్త సమస్యలను తెచ్చిపెడుతుందని, అందుకే కోపం వచ్చినపుడు కాస్త కోసం ప్రదర్శించడమే మంచిదంటున్నారు. ఎందువల్లనంటే…
పాన్ని అణిచిపెట్టుకోవడం వల్ల మనసులోని భావాలు గూడు కట్టుకొని నిరంతరం గుర్తుకొస్తూ మానసిక ఆందోళనకు గురిచేస్తాయని మానసిక శాYసనిపుణులు చెబుతున్నారు. కోపాన్ని మనసులోనే అదిమిపెట్టేయడం వల్ల అనారోగ్యానికి కూడా దగ్గరవుతారంటున్నారు. అలాంటి అనారోగ్యాలలో… చర్మ వ్యాధులు: ”చర్మం మనిషిలోని భావోద్వేగాలకు బారోమీటర్‌ వంటిది. బాధపడినపుడు చర్మకణాలు దగ్గరగా అవుతాయి. కోపాన్ని ప్రదర్శించినపుడు అవి దూరంగా సాగుతాయి.

మనల్ని మనం నిందించుకుంటున్నపుడు చర్మం శిక్షను అనుభవిస్తుంది అంటున్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ గ్రోస్‌బర్ట్‌. అంటే చర్మ సౌందర్యానికి, కోపాన్ని బహిర్గతం చేయడానికి కూడా చాలా దగ్గర సంబంధమే ఉందన్నమాట. గుండెజబ్బులు: భావోద్వేగాలను, ముఖ్యంగా కోపాన్ని అణిచి పెట్టుకోవటం వల్ల గుండె ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ”సాధారణంగా నేను గుండె సమస్యలతో బాధపడే రోగులకు వైద్యం చేసే ముందు వారి మనస్తత్వం గురించి తెలుసుకుంటూ ఉంటాను. ఇలా తెలుసుకున్న కేసుల్లో ఎక్కువమంది వారి ఫీలింగ్స్‌ను ఎవరితోనూ పంచుకొనే అలవాటు లేదని, అన్నీ మనసులోనే ఉంచుకుంటామని చెప్పారు.

వారి సమస్యకు కూడా ప్రధాన కారణం దాదాపు ఈ రకమైన ప్రవర్తనే అనే విషయం నేను తెలుసుకున్నాను అంటున్నారు గుండెజబ్బులకు సంబంధించిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ జెర్రన్‌. అంటే కోపాన్ని, భావోద్వేగాలను అణిచిపెట్టుకోవటం వల్ల గుండె కొట్టుకోవటంపై ప్రభావం ఉంటుందనే విషయం అర్థమౌతుంది కదా.

కేన్సర్‌:
మీ శరీర నిరోధక శక్తి తగ్గినపుడు కేన్సర్‌ కారక కణాలు ఒక్కసారిగా తమసంఖ్యను చాలా వేగంగా పెంచుకుంటూపోతాయి. అంటే కోపంలో మీ శరీరంలో కలిగే చలనాలు కేన్సర్‌ కారకాలపై పోరాడే శక్తిని ఉత్పన్నం చేస్తాయని అర్థం. ”నా దగ్గరకు వచ్చిన నాలుగు వందల కేన్సర్‌ వ్యాధిగ్రస్థులను బాగా పరీక్షించాను. వారి జీవన విధానం, ఆలోచనాసరళి, ప్రవర్తనలపై బాగా పరిశోధన జరిపి అడిగి తెలుసుకున్నాను. అందులో మిగతా కారణాలన్నీ ఎవరికి వారివే అయినా ఒక్క విషయంలో మాత్రం అందరూ మూకుమ్మడిగా కలిసిపోయారు

అదేమిటంటే తమలో పుట్టిన కోపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టడానికి వారు ఇష్టపడరట. పైగా అలా వ్యక్తం చేయడం వారికి చాలా ఇబ్బందిగా భావిస్తే వారిలోనే సమాధి చేస్తారట అంటున్నారు ప్రఖ్యాత కేన్సర్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ బ్రూక్స్‌. అంటే కేన్సర్‌ కారక కణాలను నాశనం చేసే శక్తి కోపానికి ఉందన్న మాట. భావోద్వేగాలను బహిర్గతం చేసేటపుడు శరీరంలో కలిగే చలనాలకు అంత శక్తి ఉంటుందని వారు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం కోపం అణచిపెట్టుకొని అనారోగ్యం పాలు కాకుండా కోపాన్ని కాస్త ప్రదర్శించి మనసును శాంతపరచండి మరి.