కోదాడలో రోడ్డు ప్రమాదం

Road Accident
Road Accident

సూర్యాపేట: జిల్లాలో కోదాడ మండలం కొమరబండ సమీపంలో టాటా ఏస్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 8మంది తీవ్రంగా క్షతగాత్రులయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సూర్యాపేట దండుమైసమ్మ గుడికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు మక్కపేట, భీమవరం, గ్రామాలకు చెందిన వీరయ్య, గురుస్వామి, ఉస్సేన్‌గా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.