కోదండరాం పార్టీ పెట్టాలని ఓయూలో పూజలు

Prof. Kodandaram
Prof. Kodandaram

హైద‌రాబాద్ః జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం పార్టీ పెట్టాలని కోరుతూ ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం వర్సిటీలోని సరస్వతి ఆలయంలో మహాయాగం, పూజలు నిర్వహించారు. నాయకులు కల్వకుర్తి అంజనేయులు, టికె.శవప్రసాద్‌, మాలిగ లింగస్వామి, సర్దార్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్థులు కీలకపాత్ర పోషించారని, విద్యార్థులను నేడు ప్రభుత్వం ఆవమానపరుస్తోందన్నారు. లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని, కోదండరాం నాయకత్వం కోరుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాసంపల్లి అరుణ్‌, రమేష్‌, నాగరాజు, అంజి, మనోజ్‌, కళ్యాణ్‌, అక్షయ్‌, భవాని, వరలక్ష్మీ, స్వాతి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.