కోటి వృక్షార్చనలో పాల్గొందాం..ఎమ్మెల్యే రోజా

హైదరాబాద్‌: 17వ తేదీన సిఎం కెసిఆర్‌ పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చనలో పాల్గొని సిఎం కెసిఆర్‌కు హరిత కానుక అందిద్దామని ఎమ్మెల్యే రోజా అన్నారు. సిఎం పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొందామని, ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటుదామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేద్దామని చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/