కోటికి తగ్గని బ్యూటీ!

HANSIKA1
HANSIKA

కోటికి తగ్గని బ్యూటీ

 

తెలుగులో సినిమాలు లేకపోయినా బబ్లీ బ్యూటీ హన్సికకు క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఎందుకంటే, ఈ చిన్నది తీసుకుంటున్న పారితోషికం ఆ రేంజిలో వుంది మరి! తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ తెలుగు చిత్రంలో నటించడానికి కోటి రూపాయలు అడిగినట్టు చెబుతున్నారు. మంచు విష్ణు కథానాయకుడుగా రాజ్‌ కిరణ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హన్సిక కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు నిర్మాత ఆమెను సంప్రదించడంతో కోటి రూపాయలు అడిగిందట. తెలుగులో సినిమాలేమీ లేకపోయినా ఆమె అంత అడిగినా, ఆ పాత్రకు ఆమె మాత్రమే కావల్సివుండడంతో ఆమె అడిగినంతా ఇచ్చుకోక తప్పలేదట. మరీ కోటి రూపాయల పారితోషికం అంటే టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ రెమ్యునరేషన్‌ కాబట్టి హన్సికకు ఆమెను వెతుక్కుంటూ వెళ్లే పాత్రలే తప్ప నిర్మాతలు మాత్రం ఆమె పారితోషికం విని వెనక్కి వచ్చేస్తున్నారు. మరి బాబిలీ బ్యూటీ తెలుగు అవకాశాల కోసం కాస్త రెమ్యునరేషన్‌ తగ్గిస్తుందేమో చూడాలి!