కోటిఎకరాలకు నీరివ్వటమే లక్ష్యం: కెటిఆర్‌

ktrfff

కోటిఎకరాలకు నీరివ్వటమే లక్ష్యం: కెటిఆర్‌

కరీంనగర్‌: రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించటమే సిఎం కెసిఆర్‌ లక్ష్యమని మంత్రి కెటిఆర్‌ అన్నారు. బుధవారం రాత్రి కాసేపటిక్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. భూనిర్వాసితుల కుటుంబం నుంచి వచ్చిన కెసిఆర్‌కు భూనిర్వాసితులకు ఏ విధంగా సహాయం చేయాలనేది ముఖ్యమంత్రికి తెలుసునని అన్నారు. ఇంటింటికి మంచినీరు,. కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నాడు ఉద్యమాలకు రాని వారు ఇవాళ ప్రాజెక్టులు కడుతుంటే అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు.