కొరియా ఉరుములు

దేశం: ఉత్తర కొరియా

North korea

కొరియా ఉరుములు

కిమ్‌ మళ్లీ ఉరిమాడు. ఈసారి మరింత శక్తివంత మైన ఖండాంతర క్షిపణి తో హూంకరించాడు. ఇలాంటి ఉరు ములు, గర్జనలు ఇటీవల తరచుగానే వినిపిస్తున్నా – ఉత్తరకొరియా తాజాగా నిర్వహించిన హాసాంగ్‌-15 క్షిపణి పరీక్ష మాత్రం నిజంగానే అందరి గుండెల్లో దడపుట్టిస్తోంది. ఈ క్షిపణి అన్నిటికంటె చాలా శక్తివంతమైనదన డంలో ఎలాంటి సందేహం లేదుగానీ దానిని శత్రువ్ఞలపై ప్రయోగిస్తే ఎంత విధ్వం సాన్ని సృష్టిస్తుందన్నది ఆలోచిస్తేనే గుండె ఆగినంత పనవ్ఞతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ క్షిపణిని రూపొందించడంతో తాము పూర్తిగా అణుశక్తి సంపన్ను లమైనట్లు ఉత్తరకొరియా అధినేత కిమ్‌ చెబుతున్నారు. తమ దేశం నుండి దానిని ప్రయోగిస్తే అమెరికాలోని ఏలక్ష్యాన్నైనా అది ఢీ కొనగలదనీ, కొన్ని వందల కిలో మీటర్ల మేర తీవ్ర విధ్వంసాన్ని సృష్టించగలదనీ ఆయ న అంటున్నారు.

అదే నిజమైతే ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా తర్వాత అత్యంత అణుశక్తి సంపన్నదేశం ఉ.కొరియానే అవ్ఞతుందనడంలో సందేహంలేదు. గత బుధవారం (29, నవంబర్‌) మూడో ఖండాం తర క్షిపణిని పరీక్షించిన తర్వాత అధినేత కిమ్‌ ధిక్కార స్వరంలో మరింత మార్పువచ్చింది. అణ్వాయుధ దేశంగా అవతరించామని చెప్పడమేగాక ఈ క్షిపణితో అమెరికాలోని ఏ ప్రాంతాన్నయినా లక్ష్యంగా చేసు కోగలమని చెప్పడంతో కిమ్‌పూర్తిగా యుద్ధసన్నద్ధుడవుతున్నారనే అనుమానం కూడా కలుగుతుంది.

ఉత్తరకొరియా విజయవంతంగా పరీక్షించిన ఖండాంతర క్షిపణుల్లో హాసాంగ్‌-15 మూడోది. రెండు నెలల విరామం తర్వాత తమ అమ్ముల పొదిలోంచి ఆయన ఈ నూతన అణ్వస్త్రాన్ని బయటకు తీశారు. ఈ క్షిపణి సామర్థ్యం గత క్షిపణుల కంటె చాలా అధికమనీ, 4475 కిమీ దూరం వరకు ఇది లక్ష్యాలను ఛేదించగ లదనీ నిపుణులు చెబుతున్నారు.

కిమ్‌ జరిపిన ఈ తాజా పరీక్ష తర్వాత జపాన్‌ మరింతగా భయకంపితమైనట్లు కనిపిస్తోంది. ప్రధాని షింజో అబే వెంటనే ఒక ప్రకటన చేస్తూ కిమ్‌ దుందు డుకు చర్యలను తాము సహించబోమనీ, ఎలాంటి ప్రతిఘటనకైనా తాము కూడా సిద్ధమేననీ హెచ్చరిం చారు. అదే విధంగా అమెరికా రాయబారి నిక్కీహేలీ ఒక ప్రకటన చేస్తూ ఉ.కొరియా చర్యలు ప్రపంచాన్ని యుద్ధం ముంగిట నిలుపుతున్నాయంటూ వ్యాఖ్యానిం చారు.

ఇంకా పలు దేశాల నేతలు కిమ్‌ దురహంకా రాన్ని ఖండిస్తూ ప్రకటనలు చేశారు. అయితే కిమ్‌ మాత్రం తమ అణుయాత్ర ఇక్కడితో ఆగదనీ, త్వరలో నాలుగో ఖండాంతర క్షిపణిని కూడా పరీక్షిస్తామనీ బదులిస్తున్నారు. ఈ హెచ్చరికలు, బెదిరింపులు చూస్తుంటే ప్రపంచ వినా శనానికి ముహూర్తం దగ్గర పడుతున్నదనే అనుమానం అందరిలో పెరుగుతోంది.

ఒకవంక బహుళ రూపా ల్లో ఐక్యరాజ్యసమితి, అమెరికా, మిత్రదేశాలు ఆంక్షలు విధిస్తున్నా కిమ్‌ ఎంత మాత్రం లెక్కచేయ కపోవడం కూడా అందరిలో ఆందోళన కలిగిస్తోంది. ఉ.కొరియాతో ఐరాస సభ్య దేశాలు సంబంధాలను తెగదెంపులు చేసుకోవడంతో పాటు మిలటరీ, శాస్త్రీయ, సాంకేతిక, వాణిజ్యరంగాల లో ద్వైపాక్షిక సహకారాన్ని కూడా నిలిపివేస్తున్నాయి. అయినా కిమ్‌ మాత్రం తన ధోరణిని ఎంత మాత్రం మార్చుకోవడం లేదనే ఆగ్రహంతో అమెరికా ఉత్తర కొరియాను ఎదుర్కొనడానికే సిద్ధమవుతోంది.

హాసాంగ్‌ క్షిపణి ప్యాంగ్‌యాంగ్‌ నుంచి ప్రయోగిస్తే అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డిసి సహా తూర్పు తీరాన్నంతటిని ధ్వంసం చేయగలదని భావిస్తున్నారు. దానితోపాటు మధ్యన గల అనేకానేక దేశాలు కూడా విధ్వంసానికి గురవుతాయి.

అందుకే ఉత్తరకొరియా హాసాంగ్‌ను పరీక్షించగానే ట్రంప్‌ మిగిలిన వ్యవ హారాలన్నీ పక్కనపెట్టి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌.జె.ఇన్‌, జపాన్‌ ప్రధాని షింజో అబేతో అత్య వసర చర్చలు జరిపి సవాల్‌ను దీటుగా ఎదుర్కొనే విషయంలో కొత్త వ్యూహాలు రూపొందించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోనూ ట్రంప్‌ ఫోన్‌లో సంభా షించినట్లు తెలుస్తోంది.

అంటే ఉ.కొరియా మూడో క్షిపణిని చూసిఅమెరికా సహా అనేక దేశాలు అంతగా భయపడుతున్నాయన్నమాట. ఇటీవల జపాన్‌ మీదుగా పసిఫిక్‌ మహాసముద్రం లోకి ఖండాంతర క్షిపణిని ప్రయోగించి ప్రపంచ వ్యాప్తంగా ఉ.కొరియా పెనుసంచలనం కలిగించిన విషయం విదితమే. ఆ తర్వాత హైడ్రోజన్‌ బాంబును కూడా పరీక్షించి చూసింది.

ఈ మధ్య ఉత్తర కొరియా ఆవిర్భావ వేడుకల సందర్భంగా పరీక్షించిన ఆ హైడ్రో జన్‌ బాంబు అమెరికా సహా అనేక దేశాల వెన్నులో వణుకు సృష్టించింది. కనీ వినీ ఎరుగని శక్తిగల రెండంచెల థెర్మో న్యూక్లియర్‌ అణ్వాయుధాలు రూపొందించడంలో ఉత్తర కొరియా ఇప్పుడు దిట్ట అని తేలడంతో జపాన్‌ కూడా ఆ అణ్వాయుధాల సంఖ్య పెంచుకొనే యత్నాలు ముమ్మరం చేసింది.

చైనా వత్తా సుపలకడంతో మరింతగా రెచ్చిపోతున్న ఉత్తరకొరియా తన వద్ద ఇంకా శక్తివంతమైన అణ్వాయుధాలు ఉన్నా యనీ, అమెరికా వద్ద కూడా లేని అణ్వస్త్రాలను తాము రూపొందించామనీ అంటోంది. దీనితో నిజంగానే యుద్ధ మేఘాలు కమ్ముకొంటున్నాయి.

కిమ్‌ మాదిరి గానే దుందుడుకు స్వభావం గల డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా యుద్ధభేరి మోగిస్తే తమ గతి ఏంకావాలని జపాన్‌, దక్షిణ కొరియా విలపిస్తున్నాయి. ట్రంప్‌, కిమ్‌ ఒకచోట సమావేశమై ఉద్రిక్తతలు తొలగించడానికి చర్యలు తీసుకోవడం మినహా ఇతర ఎలాంటి ప్రకట నల వల్ల ప్రయోజనం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ రెండు రోజుల క్రితం ఓ ప్రకటన చేశారు.

అ నేతలు ఇద్దరు అలా చేయడం మాత్రమే ఉత్తమం. చర్చించు కొంటే సమస్యలు ఏదో విధంగా పరిష్కా రమవ్ఞ తాయి. క్షిపణులు పరీక్షిస్తూ వెళ్తే ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతాయి. కిమ్‌ విజ్ఞతతో వ్యవహరిం చడం చాలా అవసరం. డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా రెచ్చ గొట్టే ధోరణిని విడనాడితే ప్రపంచానికే శ్రేయస్కరం.

-ఎ.వి.వి. ప్రసాద్‌