కొబ్బరి ప్రయోజనాలు

COCONUT
COCONUT

కొబ్బరి ప్రయోజనాలు

కొబ్బరికాయ మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. పై పీచు మొదలుకొని లోపలి గుజ్జు వరకు పనికొస్తుంది కాబట్టే దీన్ని సంపూర్ణ ఫలం అన్నారు. శుభకార్యాల సమయంలో కొబ్బరికాయ తప్పనిసరి అంటే ఎంత ప్రాముఖ్యముందో ఊహించుకోవచ్చు. ఇక దీని లోపలి కొబ్బరి వరకు చేరడానికి కొంచెం కష్టపడాల్సిందే. ముందు పై పీచునంతా ఒలి చేయాలి. అప్పుడు ముదురు గోధుమరంగు పెంకుతో ఒకవైపు మూడు కళ్లతో ఉన్న కొబ్బరికాయ కన్పిస్తుంది. దీన్ని పగలకొడితే లోపల కొబ్బరి నంటి పెట్టుకొని ఉండే ముదురురంగు పొర మరొకటి ఉంటుంది.

ఆ తర్వాతే తెల్లటి కొబ్బరి కన్పిస్తుంది. కొబ్బరికాయ కొనేటప్పుడే కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఏడాది పొడవ్ఞనా ఇవి దొరుకుతాయి. కాయ పెద్దగా ఉండి కదిలిస్తే లోపలి నీటిశబ్దం వచ్చేది ఎంచుకోవాలి. కళ్ల వద్ద తడిగా ఉండేవి ఎంచుకోకూడదు. పగలగొట్టకుండా ఉంచితే కొబ్బరికాయలు రూమ్‌ టెంపరేచర్‌లో నెలవరకు నిల్వ ఉంటాయి. కొబ్బరికాయ పగలగొట్టడం, ఒలిచి ఉప యోగించడం మనకు తెలిసినవే. తెలియనిదేమిటంటే కొబ్బరితో ఎన్ని రకాలు ఇప్పుడు దొరుకుతున్నాయని. తురిమిన కొబ్బరి పొడి, క్రీము, కొబ్బరి పాలు. ఇలా రకరకాలుగా వంటల్లో, ఇతరత్రా ఉపయోగిస్తున్నారు. అవే ఇక్కడ చూపినవి. చాలావరకు ఇవన్నీ పెద్దపెద్ద స్టోర్సులో లభిస్తున్నాయి. తురిమిన కొబ్బరిలో రకాలు తురిమి ఎండపెట్టిన కొబ్బరి. కొంచెం పెద్ద సైజులో కొబ్బరిని పలుచగా, పొడవ్ఞగా తురుముకొని ఎండబెట్టుకోవాలి.

వీటిని గాలి చొరబడని సీసాల్లో భద్రం చేసి ఫ్రిజ్‌లో ఉంచుకుంటే అవసరమయినప్పుడు కూరల్లో వేసుకుంటే రుచి బాగుంటుంది. కొబ్బరి క్రీమ్‌ ఒక వంతు నీటికి నాలుగు వంతుల కొబ్బరి కలిపి తయారుచేస్తారు. దీనిలో కొవ్ఞ్వ తీసిన వెరైటీ కూడా దొరుకుతుంది. క్రీమ్‌ వంటి కొబ్బరి కొబ్బరినంతా క్రీములా మార్చి గడ్డలుగా చేసి అమ్ముతారు. కావలసినప్పుడల్లా ఫ్రిజ్‌ నుంచి తీసి వాడుకోవచ్చు. కొబ్బరిపాలు సమపాళ్లల్లో కొబ్బరి, నీరు కలిపి ఆ మిశ్రమాన్ని బాగా వడకట్టి, కొబ్బరిపాలు తయారుచేస్తారు. పలు స్వీట్లు, అన్నం వంటకాల్లో ఉపయోగిస్తారీ పాలు. కొబ్బరిపాల పొడి స్ప్రే, డ్రయ్యింగ్‌ టెక్నాలజీ ద్వారా తయారు చేస్తారు. దీన్ని గోరువెచ్చటి నీటిలో కలిపితే కొబ్బరిపాలు రెడీ. చూశారా కొబ్బరిని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో తెలిసిందిగా. ఇలా వెరైటీతో వంటకాలు చేస్తే కొత్తరుచులు వస్తాయనడంలో సందేహం అనవసరం.