కొబ్బరి పొంగడాలు

PONGADALU
PONGADALU

కొబ్బరి పొంగడాలు

కావలసినవి
కొబ్బరికోరు-రెండు కప్పులు, తడిబియ్యం పిండి-రెండున్నర కప్పులు బెల్లం, పంచదార-కప్పు చొప్పున, యాలకులు-ఆరు నూనె-పావ్ఞకిలో, జీడిపప్పు-పావుకప్పు, నెయ్యి-నాలుగు చెంచాలు పెరుగు-కప్పు

తయారుచేసే విధానం

బెల్లానికి నీరు చేర్చి, పొయ్యి మీద పెట్టి కరిగించాలి. అందులో కొబ్బరికోరు, పంచదార, బియ్యం పిండి చేర్చి బాగా కలియతిప్పాలి. పదార్థం బాగా దగ్గర పడ్డాక నెయ్యి చేర్చి మూతపెట్టాలి. తరువాత పెరుగు వేసి గరిటె జారుగా కలిపి దించేయాలి. ఇప్పుడు పెనం వేడి చేసి అరచెంచా నెయ్యి రాసి ఈ పిండిని చిన్నచిన్న అట్లులా వేయాలి. రెండువైపులా కాల్చితే…చాలా రుచిగా ఉంటుంది. లేదంటే…నూనెలో కూడా వేయించుకోవచ్చు. అయితే ఈ పిండిని గుంట గరిటెతో తీసుకుని నూనెలో వేయాలి. వేగాక ఇది రెండు పొరలుగా విడిపోతుంది.