కొబ్బరి కజ్జికాయల పాయసం

PAYASAM1
PAYASAM1

కొబ్బరి కజ్జికాయల పాయసం

 

కావలసినవి:

కొబ్బరితురుము-రెండు కప్పులు పాలు-ఒకటి ముప్పావ్ఞ కప్పు యాలకులపొడి-అరచెంచా, దాల్చినచెక్కపొడి-కొద్దిగా బియ్యప్పిండి-రెండు కప్పులు, ఉప్పు-కొద్దిగా పాయసం కోసం కావల్సినవి పాలు-నాలుగు కప్పులు, చక్కెర-కప్పుయాలకులు-రెండు, మూడు, దాల్చినచెక్క-చిన్నముక్క

తయారుచేసే విధానం

ముందు కొబ్బరి కజ్జికాయల్ని చేసుకోవాలి. ఓ గిన్నెలో కొబ్బరితురుమూ, పాలూ తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. ఇది ముద్దలా తయారయ్యాక యాలకులపొడి, దాల్చినచెక్కపొడి వేసి దింపేయాలి. ఇప్పుడు ఓ గిన్నెలో నాలుగుకప్పుల నీళ్లు, ఉప్పు, తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అందులో బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. ఇది ఉడికి దగ్గరపడ్డాక దింపేయాలి. వేడి తగ్గాక మరోసారి కలిపి ఐదు నిమిషాలు నాననివ్వాలి. అప్పుడు కొద్దిగా తీసుకుని చిన్న చపాతీలా వత్తాలి. అందులో కొబ్బరి మిశ్రమాన్ని ఉంచి కట్టి కాయ ఆకారంలో వచ్చేలా చేసి అంచుల్ని నీళ్లతో మూసేయాలి. ఇలా మిగిలిన పిం డినీ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పాలను మరిగించి అందులో యాలకులూ, దాల్చిన చెక్కా వేసేయాలి. చక్కెర కరిగి పాలు కొద్దిగా చిక్కగా అయ్యాక కొబ్బరి కజ్జికాయల్ని అందులో వేసి మంట తగ్గించాలి.