కొన‌సాగుతోన్న అల్ప‌పీడ‌నం

Rain
Rain

హైద‌రాబాద్ఃవాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంద ని, ఎత్తుకి వెళ్లేకొద్ది నైరుతి వైపునకు ఉపరితల ఆవర్తనం దిశ మారుతున్నట్టు అధికారులు తెలిపారు. రాగల 24 గంటల్లో ఉపరితల ఆవర్తనం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.