కొనసాగుతున్న మమతా బెనర్జీ దీక్ష

Mamata
Mamata

కోల్‌కతా: పశ్చిబెంగాళ్‌ సిఎం మమతా బెనర్జీ దీక్ష కొనసాగుతోంది. శారదా కుంభకోణం కేసులో కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించే నిమిత్తం సీబీఐ అధికారులు ఆదివారం సాయంత్రం అనూహ్య రీతిలో నేరుగా ఆయన నివాసానికి వెళ్లే ప్రయత్నం చేశారు. సీబీఐ దూకుడుపై మమత అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తన పాలన యంత్రాంగం మీద దాడికి కేంద్ర బలగాలను పంపిస్తున్నారని ఆక్షేపించారు. దీనిపై తాను తక్షణం దీక్షకు దిగుతానని ప్రకటించి, రాత్రికి రాత్రి ఎస్ప్లనేడ్‌ వద్ద సత్యాగ్రహం చేపట్టారు. ఈరోజు నాటి శాసనసభ కార్యకలాపాలు తాను కూర్చొన్నచోటనే జరుగుతాయని తేల్చి చెప్పారు.