కొనసాగతున్న ఎన్నికల పోలింగ్‌.. 64.75 శాతం పోలింగ్ నమోదు

2,786 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు
20,817 వార్డు స్థానాలకు ఎన్నికలు

అమరావతి: ఏపిలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో విడతలో ఏకగ్రీవం కాగా మిగిలిన 2,786 పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 20,817 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 44,876 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇవాళ ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అక్కడక్కడా చెదరుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే సాగుతోంది. దీనిపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వివరాలు తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు 64.75 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు.

జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన పోలింగ్ ఇలా ఉంది…

•విజయనగరం71.5
•అనంతపురం70.32
•కర్నూలు69.61
•గుంటూరు69.08
•చిత్తూరు67.20
•కృష్ణా66.64
•ప్రకాశం65.15
•కడప64.28
•విశాఖ64.28
•పశ్చిమ గోదావరి63.54
•తూర్పు గోదావరి60.90
•నెల్లూరు59.92
•శ్రీకాకుళం51.30