కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు ఆంక్షలు

31st night
31st night

హైదరాబాద్‌ : మహా నగరంలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. నగరంలో ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలు జరిపే రెస్టారెంట్లు, పబ్‌లు, క్లబ్‌లు, బార్లు, ఈవెంట్‌ నిర్వాహకులు ముందస్తు అనుమతి తీసుకోవాలి అని అన్నారు.

సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి, మైనర్లను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. మద్యం తాగిన వారికి క్యాబ్‌ను సమకూర్చాల్సిన బాధ్యత ఈవెంట్ నిర్వాహకులదే అని పేర్కొన్నారు. నూతన సంవత్సర సందర్భంగా డ్రగ్స్‌ నగరంలోని కొన్ని ప్రాతాలకు చేరిందని పోలీసులకు ప్రాథమిక సమాచారం అందిందింది. ఈ వేడుకల్లో యువతే లక్ష్యంగా కొకైన్‌, ఎల్‌ఎస్‌డీ, బ్రౌన్‌ షుగర్‌ వంటివి నగరానికి చేరాయని సమాచారం. ఈ సమాచారంతో మాదక ద్రవ్యాల కేసులో అరెస్టైన కెల్విన్‌ ముఠాపై నగర పోలీసులు నిఘా వేశారు.